తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్రను ‘ఎన్టీఆర్ బయోపిక్’ గా ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్నారు. ఒకటి రాజకీయానికి సంబంధించి మరొకటి తెలుగు సినిమా రంగానికి సంబంధించిన పాత్రలు గా డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాని చిత్రీకరిస్తున్నాడు.

Image result for ntr biopic

ఈ క్రమంలో ఈ సినిమాలో పాటలకు సంబంధించి అన్నిటి విషయంలో భారీ తారాగణం ఉండాలని దగ్గరుండిమరీ నందమూరి బాలకృష్ణ పాత్రలకు తగ్గ నటీనటులను దగ్గరుండి ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలో రామారావు గారి జీవిత చరిత్ర లో తెలుగు సినిమా రంగంలో కృష్ణ, శోభన్ బాబుగారి పాత్రలతో ముడిపడిన విషయాలు సందర్భాలు చాలానే ఉన్నాయి.

Related image

అయితే తాజాగా వస్తున్న సినిమాలో కృష్ణ శోభన్ బాబు లా పాత్రలకు సంబంధించిన సన్నివేశాలు లేకుండానే చిత్రీకరించాలని డైరెక్టర్ క్రిష్ కి బాలకృష్ణ సూచించినట్లు సమాచారం. అయితే ఈ పాత్రలకు సరైన నటులు దొరకకపోవడం తో బాలకృష్ణ ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొదట్లో కృష్ణ పాత్రలో మహేష్ బాబు కనిపిస్తాడు అన్న వార్తలు వచ్చాయి, బాలకృష్ణ కూడా కృష్ణ పాత్రలో మహేష్ అయితేనే బాగుంటుందని భావించారట, అయితే మహేష్ బాబు నుండి ఇంకా ఎటువంటి స్పందన రాకపోవటం తో కృష్ణ పాత్రని తొలగించారట.

Image result for ntr biopic

కృష్ణ పాత్రే లేనప్పుడు, అంతగా ప్రాధాన్యం లేని శోభన్ బాబు పాత్ర కూడా అవసరం లేదని భావించి తొలగించారట. మొత్తంమీద ఎన్నికల ముందు ఈ సినిమాని విడుదల చేయడానికి బాలకృష్ణ అన్ని విధాల కృషి చేస్తూ సినిమాని త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.




మరింత సమాచారం తెలుసుకోండి: