అందం ఉంది. అభినయం బాగానే ఉంటుంది. కానీ లక్కు మాత్రం చిక్కనంటోంది. ఆ చక్కని చుక్కకు ఉక్కబోత తెప్పిస్తోంది కానీ హిట్టు మాత్రం కన్ను కొట్టడం లేదు. దాంతో ఆమె కంప్లీట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతోందట. అయితే ఉందిలే మంచి కాలమని సన్నిహితులు చెబుతున్నారట. మరో వైపు మీడియా వచ్చే అవకాశాలు కూడా రానీయకుండా ఐరన్ లెగ్గంటూ ప్రచారం అందుకుంటోందట.


పూజా హెగ్డే. హాట్ బ్యూటీగా వెండితెర పైకి వచ్చిన ఈ చిన్నది మొదట్లో యూత్ హీరోల పక్కన చేసింది. నాగ చైతన్య, వరుణ్ తేజ్ వంటి వారి పక్కన జోడీగా నటించి తళుక్కుమనిపించే అందంతో టాలీవుడ్ ని బాగానే ఆకట్టుకుంది. దాంతో ఆమె పంట పండింది. స్టార్ హీరో అల్లు అర్జున్  ఆమెను తన సినిమాలోకి తీసుకుని టాప్ స్టార్ ని చేశాడు. అలా వచ్చిందే దువ్వాడ జగన్నాధం డీజే. అయితే ఈ మూవీ పెద్దగా ఆడకపోవడంతో  పూజాకు నిరాశ మిగిలింది. 


ఇక లేటెస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేత మూవీలో తన సరసన పూజాకు గోల్డెన్ చాన్స్ ఇచ్చాడు. త్రివిక్రం డైరెక్షన్ తో పాటు జూనియర్ తో జోడీ అంటే పూజా ఎగిరి గంతేసింది. పైగా తన పాత్రకు తానే డబ్బింగ్ కూడా చెప్పుకుంది. ఈ సినిమాకు ఒపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి. అయినా కమర్షియల్ గా వర్కౌట్ కాకపోవడంతో పూజా డీలా పడిపోయిందట. ఈ సినిమాతో తన స్టార్ తిరుగుతుందని, టాలీవుడ్ ని ఏలేయవచ్చునని సంబరపడిన ఈ అందానికి అరవింద సమేత ఝలక్ ఇచ్చిందట.


ఇక చేతిలో మిగిలింది ఒకే ఒక్క సినిమా. అదే సూపర్ స్టార్ మహేష్ బాబు తో నటిస్తున్న మహర్షి. ఈ మూవీ హిట్ అయితే పర్వాలేదు, లేకపోతే తట్టా బుట్టా సర్దుకోమంటారేమోనని పూజా తెగ ఫీల్ అవుతోందట. తెలుగులో టాప్ హీరోయిన్లుగాఎదిగిన వారంతా ఫస్ట్ మూవీస్ చేసినవి సూపర్ డూపర్ హిట్లు కావడాన్ని గుర్తు చేస్తూ మీడియా పూజకు అంత సీన్ లేదని, అందుకే సినిమాలు పల్టీలు కొడుతున్నాయని రాసేస్తోందట.  దీంతో పూజలో కంగారు ఎక్కువైపోతోందని టాక్. ఈ ముద్దు గుమ్మ ఆలోచన్లు, ఆశలు అన్నీ కూడా ఇపుడు మహర్షి మూవీపైనే ఉన్నాయట. చూడాలి ఆ రిజల్ట్ పూజను గోల్డెన్ లెగ్ చేస్తుందో లేదో.



మరింత సమాచారం తెలుసుకోండి: