ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా లో మహేష్ గురించి నానా రచ్చ చేస్తున్నారు.  సర్కార్ సినిమా బాగుందంటూ రీసెంట్ గా ట్వీట్ చేశాడు మహేశ్. సినిమాను ఆద్యంతం ఎంజాయ్ చేశానని, మురుగదాస్ బ్రాండ్ కొట్టొచ్చినట్టు కనిపించిందని మెచ్చుకున్నాడు. కారణం లేకుండా మహేష్ ట్వీట్ చేయడనే విషయం అందరికీ తెలిసిందే. సర్కార్ తీసిన మురుగదాస్, మహేష్ కు మంచి స్నేహితుడు. గతంలో వీళ్లిద్దరూ కలిసి స్పైడర్ అనే డిజాస్టర్ మూవీ తీశారు. సో.. ఆ పరిచయంతో సర్కార్ ప్రచారం కోసం మహేష్ తో మురుగదాస్ ఇలా ట్వీట్ చేయించి ఉండొచ్చు. ఇందులో ఎలాంటి తప్పులేదు. కానీ ఈ ట్వీట్ కాస్తా ఎన్టీఆర్ అభిమానుల్ని హర్ట్ చేసింది.

Image result for mahesh babu

సర్కార్ సినిమాకు, మహేష్ ట్వీట్ కు, ఎన్టీఆర్ అభిమానులకు ఎలాంటి సంబంధం లేదు. కానీ వాళ్లు వినిపిస్తున్న వాదన మాత్రం సహేతుకంగా ఉంది. సర్కార్ లాంటి డబ్బింగ్ సినిమాను మెచ్చుకుంటూ ట్వీట్ చేసిన మహేష్ కు అరవింద సమేత సినిమా కనిపించలేదా అనేది ఎన్టీఆర్ అభిమానుల సూటిప్రశ్న. అరవింద సమేత అనే సినిమా ముక్కుమొహం లేని సినిమా కాదు. ఇందులో నటించిన ఎన్టీఆర్ స్వయానా మహేష్ కు స్నేహితుడు.

Image result for ntr and mahesh pics

పైగా మహేష్ నటించిన ఓ సినిమా ఫంక్షన్ కు ప్రత్యేక అతిథిగా కూడా హాజరయ్యాడు ఎన్టీఆర్. ఈ విషయాన్ని పక్కనపెడితే, అరవింద సమేత తీసిన త్రివిక్రమ్ కూడా మహేష్ కు బెస్ట్ ఫ్రెండ్స్. ఇలా ఎన్టీఆర్-త్రివిక్రమ్ కలిసి ఓ సినిమా తీస్తే దానిపై మహేష్ రియాక్ట్ అవ్వకపోవడం ఏంటనేది ఫ్యాన్స్ ప్రశ్న. ఇది కూడా కరెక్టే. అరవింద సమేత లాంటి పెద్ద సినిమాపై మహేష్ రియాక్ట్ అవ్వలేదు. మహేష్ ఈ సినిమా చూశాడా లేదా అనేది ఇక్కడ అప్రస్తుతం. బహుశా అతడు వ్యక్తిగతంగా ఎన్టీఆర్, త్రివిక్రమ్ కు ఫోన్ చేసి ఉండొచ్చు. అది కూడా అప్రస్తుతం. ఫ్యాన్స్ కు తెలిసేలా మహేష్ ట్వీట్ చేయడం అనేది అత్యవసరం. ఈ విషయాన్ని మరిచిపోయిన మహేష్ ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ ఆగ్రహాన్ని సోషల్ మీడియా సాక్షిగా చవిచూస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: