మెగా పవర్ స్టర రాం చరణ్ హీరోగా బోయపాటి శ్రీను డైరక్షన్ లో వస్తున్న సినిమా వినయ విధేయ రామ. రంగస్థలం తర్వాత రాం చరణ్ చేస్తున్న ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక ఈ సినిమా టీజర్ రికార్డులు కొల్లగొడుతుంది. నిన్న ఉదయం 10:25 గంటలకు రిలీజైన వి.వి.ఆర్ టీజర్ 24 గంటల్లోనే 15.1 మిలియన్ వ్యూస్ సాధించింది.


టీజర్ అలా వచ్చిందో లేదో ఇలా అందరిని అలరించింది. మెగా ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకున్న ఈ వినయ విధేయ రామ టీజర్ యూట్యూబ్ లో దుమ్ముదులిపేస్తుంది. ఒక్కరోజులో కోటి 50 లక్షల వ్యూస్ అంటే ఇది మాములు విషయం కాదు. బోయపాటి శ్రీను మార్క్ ఊర మాస్ సినిమాగా వి.వి.ఆర్ వస్తుంది.


సాఫ్ట్ టైటిల్ మాస్ టీజర్ ఇంక మెగా ఫ్యాన్స్ కు ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. అసలే రంగస్థలంతో తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్న రాం చరణ్ ఈ సినిమాతో కూడా రికార్డులపై కన్నేశాడనిపిస్తుంది. ఆ సంచలనం టీజర్ తోనే మొదలైంది. బాలయ్యకు సిం హా, లెజెండ్ లాంటి సూపర్ హిట్లు ఇచ్చిన బోయపాటి, అల్లు అర్జున్ కు సరైనోడు లాంటి సాలిడ్ హిట్ ఇచ్చాడు.


జయ జానకి నాయకా సినిమా పర్వాలేదు అనిపించినా చరణ్ తో వినయ విధేయ రామని కూడా తన మార్క్ హిట్ అందుకునేలా తీర్చిదిద్దుతున్నాడట. ఈ సినిమాలో కోలీవుడ్ హీరో ప్రశాంత్, ఆర్య రాజేష్ చరణ్ కు అన్నయ్యలుగా నటిస్తుండగా బాలీవుడ్ హీరో వివేక్ ఓబేరాయ్ విలన్ గా నటిస్తున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: