మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో అల్లు అర్జున్ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించి స్టైలిష్ స్టార్ గా సొంత స్క్రీన్ నేమ్ సొంతం చేసుకున్నాడు. సినిమా సినిమాకు తన నటనా ప్రతిభతో అందరిని అలరిస్తున్న అల్లు అర్జున్ అలియాస్ బన్ని కేవలం తెలుగు ప్రేక్షకులకే కాదు మళయాల ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యాడు.


బన్ని నటించిన ప్రతి సినిమా మల్లూ వుడ్ లో రిలీజ్ అవడం అక్కడ సూపర్ హిట్ అవడం జరుగుతున్నాయి. బన్ని లేటెస్ట్ సినిమా నా పేరు సూర్య కూడా తెలుగులో ఫ్లాప్ అవగా మళయాలంలో పర్వాలేదు అనిపించుకుంది. దాదాపు బన్నికి అక్కడ స్టార్ హీరోకి ఉన్న ఫాలోయింగ్ ఉంది. 


అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అంటే అక్కడ స్టార్ సినిమాలు కూడా వాయిదా వేసుకునే పరిస్థితి ఉంది. ఇక కేరళలో ఫ్యాన్ బేస్ చూసుకుని బన్ని మరిన్ని ప్రయోగాలు చేస్తున్నాడు. కేరళ వరదలకు పాతిక లక్షలు విరాళంగా ఇచ్చాడు బన్ని. ఈరోజు కేరళలో మొదలు పెడుతున్న నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ కు అతిథిగా వెళ్లాడు మన స్టైలిష్ స్టార్.


ఇక బన్ని వస్తున్నాడని తెలిసి కేరళ బన్ని ఫ్యాన్స్ ఫ్లెక్సీలతో హంగామా చేశారు. బన్ని కొచ్చి ఎయిర్ పోర్ట్ కు రాగానే అక్కడ వేలమంది అభిమానులు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఈ క్రేజ్ అంతా చూసి కచ్చితంగా అక్కడ సూపర్ స్టార్స్ కు మాత్రమే కాదు తెలుగు స్టార్ హీరోలకు మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉందని చెప్పొచ్చు. మరి బన్నికి వచ్చిన ఈ మల్లూ క్రేజ్ రానున్న రోజుల్లో ఎలాంటి సత్తా చాటుతాడో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: