మేల్ యాంకర్ లలో గత కొన్నాళ్లుగా మంచి పాపులారిటీ సంపాదించాడు ప్రదీప్ మాచిరాజు. అతను షో చేస్తున్నాడు అంటే షో సూపర్ హిట్ అన్నట్టే. ఇప్పటికే పలు ఛానెల్స్ లో షోలు చేస్తూ బుల్లితెర ఆడియెన్స్ ను అలరిస్తున్న ప్రదీప్ ఈమధ్య పెళ్లిచూపులు అంటూ ఓ షో మొదలు పెట్టాడు.


తన జీవిత భాగస్వామిగా రాబోయే అమ్మాయిని ఈ షో ద్వారా ఎంపిక చేసుకోవాలని అనుకున్నాడు. అంటే మోడ్రెన్ స్వయంవరం అది కూడా అమ్మాయిని అబ్బాయి సెలెక్ట్ చేసుకోవడం అన్నమాట. బిగ్ బాస్ సీజన్ 2 ముగియగానే ప్రదీప్ పెళ్లిచూపులు షో మొదలు పెట్టారు. షోకి పెట్టే ఇన్వెస్ట్ భారీగా ఉండగా కనీసం ఖర్చుల మందం కూడా రాబడి లేదట.


ప్రదీప్ పెళ్లిచూపులు ఓ అట్టర్ ఫ్లాప్ షోగా పేరు తెచ్చుకుంది. ఈ షోలో ఉండటం వల్ల సుమకి అక్షింతలు వేస్తున్నారు కొందరు అభిమానులు. సుమన్ ఏ షో చేసినా అది సూపర్ హిట్ కాని పెళ్లిచూపులకు అది వర్క్ అవుట్ కాలేదు. ఇక ఎలాగోలా షో ముగించాలని ఒకరిని సెలెక్ట్ చేసుకుని షో ముగించేశారు. అయితే ఆ అమ్మాయినే ప్రదీప్ పెళ్లాడుతాడా అన్నది నమ్మకం లేదు.


షో రక్తికట్టించేందుకు రియల్ పెళ్లిచూపులు అని షో చేసినా సెలెక్ట్ అయిన అమ్మాయినే ప్రదీప్ పెళ్లాడుతాడు అన్నది ఎవరం చెప్పలేం. సో అలా ప్రదీప్ పెళ్లిచూపుల వల్ల స్టార్ మాకు భారీ నష్టం వాటిల్లిందట. ఎంత ఏంటి అన్నది కరెక్ట్ గా తెలియదు కాని పెళ్లిచూపులు మాత్రం డిజాస్టర్ అయ్యింది.



మరింత సమాచారం తెలుసుకోండి: