ఇండస్ట్రీలో దర్శకుల వేధింపులు , హీరోల వేధింపుల గురించి ఒక్కొక్కరు బయటికొచ్చి మాట్లాడ్తున్నారు. నిన్నే పెళ్లాడుతా చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన సన ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ పరిశ్రమలో ఎన్నోచిత్రాల్లో నటించారు. ఇటీవల ప్రముఖ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సనా సెన్సేషనల్ విషయాన్ని వెళ్లడించారు. కన్నడ డైరెక్టర్ వేధింపుల గురించి, పడిన ఆవేదన గురించి పంచుకొన్నారు. సన వెల్లడించిన విషయాలు ఆమె మాటల్లోనే..

పర భాషా నటులంటే

కన్నడ డైరెక్టర్ వేధింపుల గురించి నటి సనా మాట్లాడుతూ.. సాధారణంగా ఏ భాష నుంచి నటీనటులు వచ్చిన వారిని చక్కగా ఆదరిస్తారు. కానీ కన్నడ వాళ్లు ఇతర భాషా నటులను ఆదరించరు. అప్పటికే నేను రెండు, మూడు సినిమాలు చేసినా నాకు ఓ డైరెక్టర్ నుంచి వేధింపులు ఎదురయ్యాయి. తమిళం, మలయాళంలో ఇలాంటి సమస్య ఉండదు. అయితే ఇక్కడ ఎంతో మంది ప్రతిభావంతులైన వారు ఉంటే వేరే భాష నుంచి ఎందుకు తెస్తారనే భావన వారిలో ఉంటుంది. వారికి ఇతర భాష నటులంటే సరిగా పడదు.  నేను నటించిన మూడు సినిమాలు ఆ భాషలో సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అలాంటి పరిస్థితుల్లో కన్నడ సినీ వర్గాల మనోభావాలకు విరుద్ధంగా నన్ను ఓ సెంటిమెంట్‌గా ఓ కీలకపాత్రలో నన్ను పెట్టుకొన్నారు. ఆ చిత్రంలో దొడ్డన్న లాంటి సీనియర్ నటులు ఉన్నారు.

సింగిల్ షాట్‌లో ఒకే కావాలి

ఎందుకో తెలియదు కానీ.. ఆ సినిమా డైరెక్టర్‌కు ముందు నుంచే కోపం ఉన్నట్టు కనిపించింది. ఓ సీన్‌లో నాకు ఒక పేజ్ మొత్తం ఉన్న డైలాగ్స్ ఇచ్చారు. ఇచ్చిన వెంటనే ప్రాప్టింగ్ ఉండదు. సింగిల్ షాట్‌లోనే ఓకే చేయాలి అని నాపై ఒత్తిడి తీసుకొచ్చారు. నేను ఎలానో అలా పేజ్ డైలాగ్స్ మొత్తం గుర్తించుకొని సీన్ పూర్తి చేశాను. కానీ ఏంటీ ఆ భాష అంటూ నాపై అరిచారు. సీన్‌లో సీనియర్ నటులు దొడ్డన్న, ఇతరులు ఉన్నారు. నెత్తిపైనా తీవ్రంగా ఎండ ఉంది. బ్రేక్ టైమ్ అయిపోయింది. బ్రేక్ చెబుతారేమో అని అందరూ చూస్తున్నారు. కానీ డైరెక్టర్ సాధిస్తున్నాడు. వాస్తవంగా చెప్పాలంటే నేను చెప్పిన డైలాగ్స్‌లో ఎలాంటి తప్పులు లేవు. ఒకవేళ చిన్న తప్పులు ఉన్నా వాటిని డబ్బింగ్‌లో చెప్పుకోవచ్చు. కానీ కావాలని నాపై ఏదో కక్ష సాధింపుగా నన్ను తిట్టి వెళ్లిపోయాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: