ఎక్స్ పోజింగ్ చేయడంలో బికినీలు వేసుకుని హడావిడి చేయడంలో ఇలియానాను మించిన సూపర్ ఫాస్ట్ హీరోయిన్ మరెవ్వరు ఉండరు. అలాంటి ఇలియానా పెళ్లి చేసుకున్న తరువాత పూర్తిగా మారిపోయిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. 

దీనికితోడు నిన్న జరిగిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఇలియానా లుక్ పైనే అందరి దృష్టి పడింది. ఈ ఫంక్షన్ కి కాస్త ఆలస్యంగా ఇలియానా రావడంతో చాలామంది ఇల్లీబేబి తన పద్ధతి కొనసాగిస్తూ ఈసినిమా ఫంక్షన్ కు కూడ డుమ్మా కొట్టింది అని భావించారు చాలామంది. 

అయితే ఎవ్వరూ ఊహించని విధంగా సాంప్రదాయంగా చీర కట్టుతో ఈ ఫంక్షన్ లోకి ఒక దేవతలా నడిచి వస్తున్న ఇలియానాను చూసి అప్పటి వరకు పెద్దగా చైతన్యం లేకుండా కొనసాగుతున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ఫంక్షన్ లో ఒకేసారి చైతన్యం వచ్చింది. ఇలియానాను చూడగానే ఆ ఫంక్షన్ కు వచ్చిన రవితేజ అభిమానులు ఈలలు వేస్తూ గోల చేస్తే మీడియా కెమెరాలు అన్నీ ఇలియానా చుట్టూ పరుగులు తీసాయి. 

దీనికితోడు వచ్చీ రావడంతోనే ఇలియానా చాల ఉల్లాసంగా కనిపిస్తూ ఏకంగా రవితేజాను హగ్ చేసుకోవడంతో మాస్ మహారాజ అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. అంతేకాదు అప్పటి దాకా కొంత వరకు మూడీగా కనిపించిన రవితేజ శ్రీనువైట్ల ముఖాలలో కూడ విపరీతమైన ఎనర్జీ కనిపించడంతో పెళ్ళి చేసుకుని సినిమాలకు దూరం అయినా ఇలియానా మ్యానియా ఏమాత్రం తగ్గ లేదు అన్న విషయం మరొకసారి రుజువైంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: