చిత్ర సీమలో కొన్ని కాంబినేషన్లు రిపీట్ కావాలని ఆడియన్స్ కోరుకుంటారు. అలాగే మరికొన్ని కాంబినేషన్లు కుదరాలని కూడా వేడుకుంటారు. ఆ హీరో, ఈ డైరెక్టర్, ఈ హీరోయిన్ ఆ హీరో ఇలా కలిస్తే ఆ సినిమాను చూడాలని తెగ ఉబలాటపడతారు. ప్రేక్షకుల నాడి తెలిసిన డైరెక్టర్లు కూడా సరి కొత్త కాంబోలతో వంటకాలను ఎప్పటిక‌పుడు రెడీ చేస్తూనే ఉంటారు. ఇపుడు టాలీవుడ్లో  అలాంటి  రేర్ కాంబోలు ఎన్నో వచ్చేందుకు రంగం సిధ్ధమవుతోంది.


అన్నిటికంటే ముందు చెప్పుకోవాల్సింది  దర్శక ధీరుడు రాజమౌళి జూనియర్ ఎంటీయర్, రాం చరణ్ సూపర్  కాంబోలో వస్తున్న మల్టీ స్టారర్ మూవీ. ఆర్ ఆర్ ఆర్. ఈ మూవీ గురించి అనౌన్స్ చేయగానే ఎక్కడలేని హైప్ వచ్చిపడింది. కధేంటి, మిగతా  విషయలేంటి అన్నది లేకుండా ఈ మూవీ వస్తే చూసి తీరాలన్న కోరికను ప్రకటన వెలువడ్డంతోనే ఆడియన్స్ లో కలిగింది. ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్ళే సన్నాహాల్లో ఉంది. విడుదల అయ్యేసరికి బాగానే టైం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.


ఇక మరో  కాంబో ఇపుడు ఇంటెరెస్ట్ క్రియేట్ చేస్తోంది. మెగా స్టార్ చిరంజీవి, సెన్షేషనల్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో రాబోతున్న చిత్రం పై చాలా ఎక్స్పెటేషన్లు ఉన్నాయి. ఈ మూవీ తొందరలోనే సెట్స్ మీదకు వెళ్తోంది. అలాగే మరో మూవీ బాలక్రిష్ణ బోయపాటి కలయికలోని చిత్రం. ఈ మూవీ కోసం నందమూరి అభిమానులే కాకుండా సగటు ప్రేక్షకుడు కూడా ఆసక్తిని ప్రదర్శిస్తున్నాడు. ఎందుకంటే ఈ ఇద్దరు కలసి సిమ్హా,  లెజెండ్ వంటి సూపర్ డూపర్ హిట్లు ఇచ్చారు. హ్యాట్రిక్ మూవీ ఎలా ఉంటుందోనని అందరిలోనూ ఉత్కంఠ ఉంది.


అలాగే మరి కొన్ని కాంబోలు కలవాలని కోరుకుంటున్నారు. అందుకో మహేష్ బాబు రాజమౌళి మూవీ ఒకటి. ఈ ఇద్దరూ కలిస్తే అది కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని అందరి ఆశ. ఇక మహేష్ తో సుకుమార్ తొందరలో ఓ మూవీ చేయబోతున్నారని న్యూస్ వస్తోంది. దానిపైన కూడా ఫ్యాన్స్ తో పాటు అందరి చూపూ ఉంది.


 అలాగే మహెష్, జూనియర్ ఎంటీయార్ కాంబ్లోలో మూవీ రావాలని ఆశ పడుతున్న వారూ ఉన్నారు. అలగే బాలయ్య, జూనియర్ ఎంటీయార్ తో కలిపి ఓ మూవీ రావాలని నందమూరి ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి ఇలాంటి కాంబోలను కలిపేందుకే టాప్ డైరెక్టర్లు  రెడీగా  ఉన్నారు. లేట్ అయినా అవి వస్తాయి. బాక్స్ ఆఫీస్ ని షేక్ కూడా చేస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: