నిన్నరాత్రి జరిగిన ‘టాక్సీవాలా’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో విజయ్ దేవరకొండ ఉద్వేగంగా ఊగిపోయాడు. విజయ్ అభిమానుల మధ్య కోలాహలంగా జరిగిన ఈ ఫంక్షన్ లో తన అభిమానులు అయిన రౌడీస్ ను ఉద్దేసించి మాట్లాడుతూ ఈవారం విడుదల కాబోతున్న ‘టాక్సీవాలా’ కు ఘన విజయం చేకూర్చి తన అభిమానుల స్టామినాను నిరూపించి ఇండస్ట్రీకి తెలియచేయవలసిందిగా తన మిడిల్ ఫింగర్ చూపెడుతూ మరొకసారి విజయ్ తన ఇగో ను ప్రదర్శించాడు.

ఈసినిమాను దెబ్బ తీయాలని జరుగుతున్న నెగిటివ్ ప్రచారం గురించి మాట్లాడుతూ ఈమూవీని పైరసీ చేసిన వారికి తన అభిమానులు అంతా తనలా తమ మిడిల్ ఫింగర్ చూపెట్టి ఈమూవీని హిట్ చేసి పైరసీ చేసిన వారికి సరైన గుణ పాఠం చెప్పవలసిందిగా విజయ్ దేవరకొండ ఉద్వేగంగా ఆవేశ పడ్డాడు. వాస్తవానికి పైరసీ అయిన ఈమూవీ 3గంటల 40 నిముషాల నిడివితో ఎటువంటి సౌండ్ గ్రాఫిక్స్ వర్క్స్ లేకుండా ఉన్న రా మూవీ అని అంటూ ఇప్పుడు ఆసినిమాను అద్భుతమైన సౌండ్ తో డైలాగ్స్ తో అన్నింటా మించి గ్రాఫిక్స్ తో 2గంటల 10 నిముషాల మూవీగా మారిన విషయాన్ని విజయ్ వివరించాడు.  

ఇదే సందర్భంలో ఈ ఫంక్షన్ కు అతిధిగా వచ్చిన అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ తాను జీవితంలో అల్లు అర్జున్ స్థాయిలో డాన్స్ లు చేయలేనని అంటూ బన్నీ పై ప్రశంసలు కురిపించాడు. తన పెళ్లి చూపులు సినిమా తరువాత తాను మొట్టమొదటిసారి బన్నీని కలిసిన సందర్భాన్ని వివరిస్తూ తనతో 20 నిముషాలు ఎటువంటి ఇగోను ప్రదర్శించకుండా బన్నీ తన పై చూపించిన అభిమానం తాను జీవితంలో మర్చిపోలేను అంటూ అల్లు అర్జున్ ను ఆకాశానికి ఎత్తేశాడు విజయ్ దేవరకొండ. 

‘గీత గోవిందం’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అల్లు అర్జున్ వచ్చిన నేపధ్యంలో ఆమూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది కాబట్టి ఇప్పుడు కూడ బన్నీ రాక వల్ల ‘టాక్సీవాలా’ మరో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని జోశ్యం చెపుతున్నాడు విజయ్. ఈ సెంటిమెంట్ ఎలా ఉన్నా ఈమూవీ విజయం విజయ్ కెరియర్ కు అత్యంత కీలకం కాబట్టి నిన్నటి ఫంక్షన్ లో ఆ స్థాయిలో విజయ్ ఉద్వేగంతో ఊగిపోయాడు అనుకోవాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: