రాజమౌళి భారీ మల్టీ స్టారర్ ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రారంభోత్సవానికి ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు అంతా హాజరైనా నందమూరి సింహం బాలకృష్ణ ఈ ఈవెంట్ కు డుమ్మా కొట్టడం వెనుక ఆంతర్యం ఏమిటి అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు నిన్నటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావలసిందిగా రాజమౌళి బాలయ్యను వ్యక్తిగతంగా ఆహ్వానించడంతో ఈకార్యక్రమానికి బాలకృష్ణ కూడ వస్తున్నాడు అంటూ చివరి నిముషంలో వార్తలు హడావిడి చేసాయి.
చిరును రిసీవ్ చేసుకున్న రాజమౌళి
రాజమౌళి చరణ్ జూనియర్ లతో ‘ఆర్ ఆర్ ఆర్’ తీస్తున్న నేపధ్యంలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన చిరంజీవితో పాటు ఈకార్యక్రమాన్ని బ్యాలెన్స్ చేయడానికి బాలయ్యను కూడ ఆహ్వానించినట్లు టాక్. దీనికితోడు రాఘవేంద్రరావుతో బాలకృష్ణకు ఉన్న సాన్నిహిత్యం రీత్యా బాలయ్య పై రాజమౌళి ఒత్తిడి కూడ చేసినట్లు వార్తలు కూడ వచ్చాయి. 
అరుదైన సన్నివేశం
అయితే చివరి నిముషంలో వచ్చిన ఈ పిలుపుకు బాలయ్య తన ఎన్టీఆర్ బయోపిక్ వంక చెప్పి మర్యాదపూర్వకంగా సమాధానం ఇచ్చి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఈమధ్య జూనియర్ బాలయ్యల మధ్య పెరిగిన సాన్నిహిత్యంతో నందమూరి కుటుంబ పెద్దగా బాలయ్య వచ్చి జూనియర్ చరణ్ లను ఆశీర్వదిస్తే ఈ భారీ ప్రాజెక్ట్ కు నందమూరి మెగా ఫ్యామిలీల సపోర్ట్ ఓపెన్ గా దొరికినట్లు సంకేతాలు వచ్చి ఉండేవి అని ఇండస్ట్రీలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు. 
ఆర్ఆర్ఆర్ అంటే ఇదే
దీనికితోడు త్వరలో జరగబోయే మోక్షజ్ఞ ఫిలిం ఎంట్రీకి సంబంధించి బాలకృష్ణ రాజమౌళి సలహాలను అడుగుతున్నాడు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో బాలయ్య ఎందుకు ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ లాంచ్ కి రాలేదు అన్న కోణంలో చర్చలు మొదలయ్యాయి. ఒక్క బాలకృష్ణ మినహా ఫిలిం ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు అందరు నిన్నటి ఈవెంట్ కు హాజరు కావడంతో కొద్దిసేపు మాత్రమే జరిగిన ‘ఆర్ ఆర్ ఆర్’ లాంచ్ చాల సందడిగా జరిగినట్లు సమాచారం..  


మరింత సమాచారం తెలుసుకోండి: