రెండురోజుల క్రితం జరిగిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో రవితేజా కంటే ఎక్కువగా ఇలియానా అందరి దృష్టిని ఆకర్షించి హాట్ న్యూస్ కు చిరునామాగా మారింది. దీనికితోడు ఆమె ఈ ఈవెంట్ లో రవితేజా కన్నా చాల యాక్టివ్ గా కనిపిస్తూ అందరితో కలుపుకు పోతూ అందర్నీ పలకరిస్తూ చేసిన హడావిడి ఆ ఈవెంట్ కు విపరీతమైన క్రేజ్ ను తెచ్చిపెట్టింది. 
శ్రీను వైట్ల గ్రేట్ యాక్టర్
ఇలాంటి పరిస్థుతులలో ఇలియానా ఈ ఈవెంట్ లో రవితేజాను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ కు మాస్ మహారాజ అభిమానులు ఆందోళన పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా కుర్రహీరోలు సిక్స్ ప్యాక్ సంపాదించడం పెద్ద కష్టం కాదు. కానీ రవితేజ లాంటి వయసు మళ్లిన హీరో సిక్స్ ప్యాక్ సాధించాడంటే కచ్చితంగా అది అందరూ ఆశ్చర్యపడే విషయమే. 
ఇలియానా నా డార్లింగ్
‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలో రవితేజ సిక్స్ ప్యాక్ లో కనిపించబోతున్నాడని స్వయంగా ఇలియానా చెప్పడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. ఈమూవీలో మూడు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు రవితేజ. వీటిలో ఒక డాక్టర్ పాత్ర కూడా ఉంది అయితే ఈ మూడు పాత్రల్లో ఏ క్యారెక్టర్ సిక్స్ ప్యాక్ లో కనిపించబోతోందనే విషయంపై క్లారిటీలేదు. 
హిట్టు ప్లాపుకు సంబంధం లేకుండా
ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో రిలీజ్ చేసిన ట్రయిలర్ లో కూడా సిక్స్ ప్యాక్ ప్రస్తావన లేదు. దీనితో ఇలియానా రవితేజాను ఆటపట్టించదానికి ఇలా జోక్ చేసిందా లేకుంటే మాస్ మహారాజా నిజంగా సిక్స్ ప్యాక్ సాధించాడా అనేది పెద్ద అనుమానంగా మారడంతో ఇప్పటికే ముఖంలో గ్లో తగ్గిన రవితేజ సిక్స్ ప్యాక్ లుక్ ను ఎవరు చూస్తారు అంటూ అభిమానులు కూడ ఆశ్చర్యపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఇలియానా రవితేజా పై ఇలాంటి ప్రాక్టికల్ జోక్స్ ఎందుకు వేసిందో ఎవరికీ అర్ధం కాని విషయంగా మారింది..
 


మరింత సమాచారం తెలుసుకోండి: