ఈ మద్య కాస్టింగ్ కౌచ్, మీ టూ అంటూ చిత్ర పరిశ్రమలోనే కాదు ఇతర రంగాల్లో సైతం పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతుంది.  అయితే హాలీవుడ్ లో మొదలైన ‘మీ టూ’ ఉద్యమం ఇప్పుడు బాలీవుడ్ లో ఎక్కువగా కనిపిస్తుంది.  ఆ మద్య తనూశ్రీ దత్తా, కంగనా రౌనత్ ఇతర నటీమణులు గతంలో తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి గళం విప్పారు.  దక్షిణాదిన సింగర్ చిన్మయి ‘మీ టూ ’ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటుంది. 
Image result for kerala pizza actress ramya
ఇదిలా ఉంటే..క్యాస్టింగ్ కౌచ్ పై ప్రశ్నించినందుకు తనకు ఒక్క అవకాశం కూడా లేకుండా చేశారని కేరళ బ్యూటీ, పలు తమిళ, మలయాళ హిట్ చిత్రాల్లో నటించిన రమ్య నంబీశన్ వాపోతోంది.  గతంలో తాను అందరి గురించి పోరాటానికి సిద్దమైనా..తనకు మాత్రం పెద్దగా సహకారం అందలేదని..పైగా   కొత్తగా ఒక్క అవకాశం కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల భద్రత కోసం డబ్ల్యూసీసీ పేరిట ఓ సంఘం ఏర్పాటు కాగా, దానిద్వారా ప్రశ్నించిన తనను పక్కన పెట్టేశారని చెప్పుకొచ్చింది రమ్య.   కోలీవుడ్ లో పిజా, సేతుపతి, మెర్క్యూరీ వంటి సినిమాల్లో నటించిన రమ్య, తాజా చిత్రం 'నట్పున్నా ఎన్నాన్ను తెరియుమా' విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం తాను కోలీవుడ్ లో కొనసాగాలని భావిస్తున్నట్లు తెలిపింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: