టాలీవుడ్ లో వారసత్వపు హీరోగా పరిచయం అయిన బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా తెర‌కెక్కుతోన్న చిత్రం ‘క‌వ‌చం’. దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళ ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో శ్రీనివాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. దీపావళి సందర్భంగా విడుదలైన శ్రీనివాస్ ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మొదటి సినిమా ‘అల్లుడు శీను’ తో  మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న బెల్లం కొండ శ్రీనివాస్ తర్వాత వచ్చిన సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. 
Image result for bellamkonda srinivas
ఇక మాస్ దర్శకులు బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘జయ జానకీ నాయకా’ సినిమాతో కమర్షియల్ హిట్ కాకున్నా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి మంచి పేరు వచ్చింది. యాక్షన్ తరహా సాగిన ఈ సినిమాలో ఎంతో పవర్ ఫుల్ గా కనిపించాడు. బెల్లంకొండ  శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘కవచం’లో మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. కొత్త దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళ ఈ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నారు. మెహ్రీన్ కౌర్, హర్షవర్ధన్ రానే, బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ఇందులో కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
Image result for kavacham movie stills
ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. కేవలం పాటల చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఎస్.ఎస్.థ‌మ‌న్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి ఛోటా కే నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వంశ‌ధార క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ సొంటినేని(నాని) నిర్మిస్తున్నారు. డిసెంబ‌ర్‌లో ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఈ సినిమా హిట్ అయితే బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ గాడిన పడే అవకాశం ఉందని..లేదంటే ఇబ్బందులో పడొచ్చని ఫిలిమ్ వర్గాలు అంటున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: