విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ ప్రీరిలీజ్ ఫంక్షన్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ ఈమూవీ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ ను టార్గెట్ చేస్తూ వేసిన జోక్స్ ఆఫంక్షన్ కు హాజరైన వారిని తెగ నవ్వించాయి. ఈమూవీ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్  పేరుకు మరాఠి అమ్మాయి అయినా    పెరిగింది మాత్రం అనంతపూర్ లో అన్న విషయాన్ని ప్రస్తావిస్తూ తెలుగుని గౌరవించే వాళ్ళు ఎవరైనా తెలుగువారే అంటూ ఆమె పై ప్రశంసలు కురిపించాడు.  
మీటూ చూసినప్పుడు అనిపిస్తుంది
ప్రియాంక  తనపై  ప్రేమ ఉంది అని ఈఫంక్షన్ లో చెప్పినప్పుడు తనకు ఆనందం కలిగినా ఆవిషయం ఇప్పుడు తెలిసి ఏమి ప్రయోజనం అంతా అయిపోయింది కదా అంటూ తనకు పెళ్ళి అయి పిల్లలు కూడ ఉన్న విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ప్రియాంక పై సానుభూతి కనపరిచాడు బన్నీ. ఇదే సందర్భంలో సినిమా రచయితలు గురించి మాట్లాడుతూ ఒక మూవీ సక్సస్ లో రచయిత పాత్ర చాల ప్రధానంగా ఉంటుందని అందువల్లనే తనకు రచయితలు అంటే విపరీతమైన గౌరవం అంటూ కామెంట్ చేసాడు. 
బావ జూ.ఎన్టీఆర్‌కి
ప్రస్తుతం ఇండస్ట్రీని కుదిపేస్తున్న ‘మీ టూ’ ఉద్యమం గురించి మాట్లాడుతూ ప్రస్తుతం ఇండస్ట్రీలో అమ్మాయిలకు చాల గౌరవం ఉంది ధైర్యంగా అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావచ్చు అంటూ కామెంట్స్ చేసాడు. ఇదే సందర్భంలో తన తమ్ముడు శిరీష్ గురించి మాట్లాడుతూ తన అభిమానులతో ఎప్పుడు టచ్ లో ఉంటూ తన అభిమానుల సంఖ్య చెదిరిపోకుండా చూసుకునే విషయంలో అల్లు శిరీష్ చేస్తున్న కృషి తనకు ఎంతో సహకరిస్తోంది అంటూ ప్రశంసలు కురిపించాడు బన్నీ.
ప్లాప్ కావాలని కోరుకునేవారు
సాధారణంగా తాను చేసే సినిమాల నిర్మాతల విషయంలో తాను పెద్దగా పట్టించుకోనని అంటూ తప్పకుండా తన మూవీ ఈసినిమాను నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఉండబోతోంది అన్న సంకేతాలు ఇచ్చాడు ఈ స్టైలిష్ స్టార్. ఇక్కడే మరొక ట్విస్ట్ ఇస్తూ అల్లు అర్జున్ ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ గురించి మాట్లాడుతూ ‘మెగా పవర్ స్టార్ రాంచరణ్ గారికీ నేను సరదాగా బావా అని పిలిచే ఎన్టీఆర్ కి, తెలుగు సినిమాకు గర్వకారణమైన రాజమౌళి గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’ అంటూ చరణ్ ని గారు అంటూ జూనియర్ ను బావా అంటూ బన్నీ సెటైరికల్ గా సంభోదించడం నిన్నటి కార్యక్రమంలో హైలెట్..  



మరింత సమాచారం తెలుసుకోండి: