చాలా కాలం తర్వాత తెలుగు ఇండస్ట్రీలో అద్భుతమైన కాంబినేషన్ రిపీట్ అవుతుంది.  దుబాయ్ శీను లాంటి సూపర్ హిట్ తర్వాత శ్రీనువైట్ల, రవితేజ కాంబినేషన్ లో  'అమర్ అక్బర్ ఆంటోని'  రూపొందింది.  ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. దేవదాస్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయిన గోవా బ్యూటీ ఇలియానా చాలా గ్యాప్ తర్వాత ఈ చిత్రంలో నటిస్తుంది.  ఈ చిత్రం ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ సందర్బంగా ఇలియానా మాట్లాడుతూ..ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వడానికి కారణం కథ నాకు బాగా నచ్చడమే.
వరుస ఫ్లాపుల అనంతరం
నాకు తెలుగు పెద్దగా రాకపోయినా నాతో శ్రీను వైట్ల డబ్బింగ్ చెప్పించారు. ఆయన సహకారం వల్లనే సాహసం చేశాను. ‘అమర్ అక్బర్ ఆంథోని’ చిత్రంలో ఓ ప్రత్యేకత ఉంది. ఈ చిత్రంలో రవితేజ్ సిక్స్‌ప్యాక్‌లో కనిపిస్తారు అని ఇలియానా చెప్పగానే..ఇప్పటి వరకు ఈ విషయం ఎక్కడా లీక్ కాలేదు..మొత్తానికి ఇలియానా సీక్రెట్ చెప్పేసింది.  దాంతో  రవితేజ, శ్రీనువైట్ల ఒకరి ముఖం ఒకరు చూసుకొన్నారు. నిజానికి విడుదల వరకూ ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచుదామని శ్రీను వైట్ల — రవితేజ అనుకున్నారు.
సిక్స్‌ప్యాక్‌తో మాస్ మహారాజా
ఆ సీక్రెట్ ను కాస్తా ఇలియానా చెప్పేయడంతో రవితేజ - శ్రీను వైట్ల ఒక్కసారే షాక్ తిన్నారు. అంతే కాదు తమన్ ఇచ్చే పాటలు నాకు బాగా నచ్చుతాయి. గతంలో ఆయన అందించిన గో గో గోరే పాట నాకు ఇష్టం. ఈ చిత్రంలో పాటలు అందరికీ చాలా బాగా నచ్చుతాయని చెప్పింది ఇలియానా. వరుస ఫ్లాపుల తర్వాత శ్రీనువైట్ల అందిస్తున్న అమర్ అక్బర్ ఆంథోని చిత్రం నవంబర్ 16న రిలీజ్ కానున్నది. ఈ చిత్రంలో రవితేజ త్రిపాత్రాభినయం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం పై కూడా చాలా సీక్రెట్ మెయింటేన్ చేస్తున్నారు చిత్ర యూనిట్. 

మరింత సమాచారం తెలుసుకోండి: