టాలీవుడ్ లో ఒకప్పుడు అక్కినేని నాగార్జున సరసన ‘రక్షకుడు’ సినిమాలో తళుక్కున మెరిసింది బాలీవుడ్ హీరోయిన్ సుస్మితాసేన్.  ఆ తర్వాత తెలుగు తెరపై మళ్లీ కనిపించలేదు. సాధారణంగా సుస్మితాసేన్ పర్సనల్ విషయాలు తరచూ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుంటాయి.  కొన్ని సార్లు ఆమె చేసే కాంట్రవర్సీ కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచాయి.  ఆ మద్య మోడల్ రోమన్ షాల్ తో బాలీవుడ్ భామ సుస్మితా సేన్ డేటింగ్ చేస్తోందనే వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇటీవల హీరోయిన్ శిల్పాశెట్టి ఇంట్లో జరిగిన ఫంక్షన్‌లో సుస్మిత, రెహమాన్ జంటగా కనిపించారు.  అంతే కాదు త్వరలో వీరిద్దరూ  పెళ్లిపీటలు ఎక్కబోతున్నారనే వార్తలు కూడా వినిపించాయి. ఈ వార్తలపై సుస్మిత స్పందించింది... రోమన్ తో డేటింగ్ చేస్తున్న విషయం నిజమేనని ఆమె తెలిపింది. అయితే, ఇప్పటికి కూడా పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదని చెప్పింది.
Related image
మోడల్ రోమన్ ను కొన్ని నెలల క్రితం సుస్మిత కలిసింది. పలుమార్లు వీరిద్దరూ చెట్టా పట్టాలేసుకొని తిరగడం.. కెమరాల కంటికి చిక్కిన విషయం తెలిసిందే.  ఇద్దరూ కలసి తాజ్ మహల్ కూడా సందర్శించారు. ఢిల్లీకి చెందిన రెహమాన్ షాల్ సూపర్ మోడల్..ఎంతో మంది సెలబ్రిటీ డిజైనర్ల కోసం రోమన్ ర్యాంప్ వాక్ చేశారు.  అతని వయసు 27 ఏళ్లు, సుస్మితకు 42 ఏళ్లు. వీరి మధ్య 15 ఏళ్ల అంతరం ఉంది. కాగా సుస్మిత ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని వారిని సంరక్షిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: