రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ప్రారంభం జరిగి పోవడంతో ఇప్పుడు అందరి దృష్టి త్వరలో ప్రారంభం కాబోతున్న ఈమూవీ షెడ్యూల్ పై పడింది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 19 నుంచి ప్రారంభం కాబోతోంది. ఈమూవీ ప్రారంభానికి ఎందరో ప్రముఖులు వచ్చినా అందరి దృష్టి మాత్రం ఈమూవీ ప్రారంభోత్సవానికి హాజరైన జూనియర్ చరణ్ ల పై ఉండటంతో ఈమూవీ  ముహూర్తం షాట్ కు వచ్చిన ఎన్టీఆర్ ను చూసి అందరికీ ఆశ్చర్యం కలిగింది. 
సినిమాటోగ్రఫీ అతడే
కాస్త బలంగా బుగ్గలతో గుబురు గడ్డంతో జూనియర్ కనిపిస్తూ తెలుస్తున్న సమాచారం మేరకు  ఎన్టీఆర్ గెటప్ ‘దంగల్’ సినిమాలో అమీర్ ఖాన్ మాదిరిగా కండలు తిరిగిన దేహంతో ‘ఆర్ ఆర్ ఆర్. లోఉంటుందని టాక్. అయితే గెడ్డం కొంత వరకు ట్రిమ్ చేసి డిఫెరెంట్ లుక్ లో జూనియర్ ను చూపెడతారు అని అంటున్నారు. 
అభిమానులంతా ఆసక్తిగా
అయితే ఇదే మూవీలో మరో హీరో పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ శారీరక కొలతల మార్పులేవీ ఉండవని హెయిర్ స్టైల్ గడ్డం మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉంటాయనీ తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా ఈమూవీకి కూడ ‘బాహుబలి’ రెండు భాగాలకు కెమెరా మాన్ గా పనిచేసిన సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించ బోతున్నాడు. 
రామ్ చరణ్‌తో ప్రభాస్
అయితే ఈ సినిమాకుసంబంధించి ఎడిటర్ గా రాజమౌళి ఎంపిక చేసుకున్న వ్యక్తి ఆసక్తి కలిగిస్తోంది. 8 సార్లు జాతీయ అవార్డు విజేతగా నిలిచిన శ్రీకర్ ప్రసాద్ ఈ చిత్రానికి ఎడిటింగ్ భాద్యతలుచేపట్టనున్నాడు. ఇక హీరోయిన్స్ విషయంలో కూడ ఇప్పటికే రాజమౌళి ఒక స్థిరనిర్ణయానికి వచ్చిన నేపధ్యంలో ఆ విషయం కూడ త్వరలో ప్రకటించ బోతున్నట్లు సంమాచారం..  


మరింత సమాచారం తెలుసుకోండి: