ఒకవైపు ‘మీ టూ’ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతుంటే ఆవిషయంతో సంబంధం లేకుండా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె.నాయుడు మితిమీరిన అత్యుత్సాహంతో హీరోయిన్ కాజల్ ను ఓపెన్ గా ముద్దు పెట్టుకున్న సంఘటన తీవ్ర విమర్శలకు తావు ఇస్తోంది. ఈ సంఘటన నిన్న జరిగిన ‘కవచం’ మూవీ ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ లో జరిగింది. 
కాజల్ షాక్... స్వీట్ వార్నింగ్
ఇప్పటి వరకు సినిమా ఫంక్షన్లలో హగ్గింగ్సే తప్ప కిస్సింగ్స్ ఉండని నేపధ్యంలో ఈ మితిమీరిన సంఘటన చూసి ఇండస్ట్రీ వర్గాలు కూడ ఆశ్చర్య పడుతున్నాయి. అయితే జరిగిన ఈ సంఘటన పై ఛోటా కె నాయుడు స్పందిస్తూ తాను సంగీత దర్శకుడు తమన్ తనను కాజల్ ను ఓపెన్ గా ముద్దు పెట్టుకో గలవా ? అంటూ జోక్ చేసి సవాల్ విసరడంతో తాను ఈవిధంగా ప్రవర్తించానని అసలు విషయానికి తమన్ మాత్రమే కారకుడు అంటూ తెలివిగా ఈ విమర్శల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. 
ఇట్స్ ఓకే స్మాల్... నువ్వు నా ఫ్యామిలీ
అయితే మీడియాలో ఇంత రగడ జరుగుతున్న ఈ సంఘటనకు కాజల్ చాల తెలివిగా రియాక్ట్ అయింది. ఛోటాను ముద్దుగా ‘స్మాల్' అని పిలిచిన కాజల్ ‘‘నువ్వు చేసిన పనికి కోపం రావడం లేదు, ఫర్వా లేదు.... నువ్వు నా ఫ్యామిలీ మెంబర్ మాదిరి'' అంటూ ఈ విషయాన్ని పెద్దగా చేయకుండా ముగించి అందరికీ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. 
తమన్ రెచ్చగొట్టాడం వల్లే అంటున్న ఛోటా
వాస్తవానికి వేదిక పై కాజల్ అలా తెలివిగా స్పందించినా ఆక్షణంలో కాజల్ ముఖ కవళికలను పరిశీలించిన వారు కాజల్ ఊహించని షాక్ కు గురైంది అని అంటున్నారు. ఇప్పటికే మీ టూ ఉద్యమం ఇండస్ట్రీని షేక్ చేస్తున్న పరిస్థుతులలో కాజల్ హుందాగా ఈ సంఘటన పై స్పందించినా ఇండస్ట్రీలో ఫిలిం హీరోయిన్స్ ను ఎంత తక్కువ దృష్టితో చూస్తున్నారో అన్న విషయానికి చోటా కె. నాయుడు వ్యవహరించిన తీరు ఉదాహరణ అంటూ కామెంట్స్ వస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: