స్టేజ్ మీదే కాజల్ కు ఛోటా ముద్దు పెట్టడం తో అక్కడున్న వారంతా అవాక్కవడం వారివంతైంది. కవచం' సినిమా టీజర్‌ విడుదల సందర్భంగా, వేదికపై హీరోయిన్‌ కాజల్‌ని ముద్దాడేశాడు ఛోటా కె నాయుడు. ఊహించని ఈ ఘటనతో కాజల్‌ షాక్‌ అయితే, పక్కనే వున్న మెహరీన్‌ కూడా బిత్తరపోయింది. మొత్తంగా ఈ ఈవెంట్‌లో ఛోటా చేసిన ఆ పనికి అందరూ ముక్కున వేలేసుకున్నారు. అసలు ఛోటా కె నాయుడికి ఏమయ్యింది.? అని టాలీవుడ్‌లో ఇప్పుడంతా ఈ విషయం గురించే చర్చించుకుంటుండడం గమనార్హం. 

Image result for kajal

రోజులు బాగా మారిపోయాయ్‌. ఎప్పుడో పదేళ్ళు, పాతికేళ్ళ నాటి సంఘటనల్ని ఫ్రెష్‌గా తెరపైకి తెచ్చి 'మీ..టూ..' అనేస్తున్నారు అందాల భామలు. ఈ పరిస్థితుల్లో పురుష పుంగవులు ఏ పని చేయాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిందే. అందాల భామలు అడ్వాంటేజ్‌ తీసుకుంటున్నా, టెక్నీషియన్స్‌ ఛాన్స్‌ తీసుకోవట్లేదు. అమలా పాల్‌ విషయంలో ఓ యువ దర్శకుడు ఎంతలా జాగ్రత్తపడ్డాడో చూశాం.

Image result for kajal

'అతను చాలా మంచోడు.. నేను కౌగలించుకుందామనుకున్నా.. ఒప్పుకోలేదు..' అంటూ అమలా పాల్‌ ఆ దర్శకుడి గురించి చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది. నిజ్జంగానే, ఇప్పుడు సినీ రంగంలో చాలా మంది ఇలాంటి జాగ్రత్తలే తీసుకుంటున్నారు.  మరి, ఛోటా కె నాయుడు అంత 'జాగ్రత్త' ఎందుకు వహించలేదట.? ఏమోగానీ, సీనియర్‌ సినిమాటోగ్రాఫర్‌ కావడంతో.. ఊహించని ఘటనే అయినా, కాజల్‌ ఆ 'ముద్దు' విషయాన్ని లైట్‌ తీసుకుంది. నడుమ్మీద చెయ్యేసి.. ఠక్కున ముద్దు పెట్టేసిన ఛోటా కె నాయుడు ఈ విషయంపై ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: