రాజమౌళి తానుతీసే సినిమాలలో ఎంతభారీగా ఉంటాడో అందరికీ తెలిసిన విషయం. ప్రస్తుతం అత్యంత భారీఅంచనాలతో ప్రారంభం అయిన ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ షూటింగ్ కోసం భారీ సెట్స్ నిర్మాణం చేస్తున్న రాజమౌళి హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈమూవీ కోసం నిర్మించిన ఒకభారీ సెట్ ను ఆనుకుని ఈమూవీ ఆఫీసు పనుల నిమిత్తం రాజమౌళి సూచనలతో నిర్మింపబడ్డ ఒకపెద్ద మండువా ఇల్లు ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. రాజమౌళికి చిన్నతనం అంతా అతడి తల్లితండ్రుల ఒకనాటి మండువా ఇంటిలో అతడి బాల్యం గడపడంతో రాజమౌళికి అలాంటి మండువా ఇల్లు అంటే విపరీతమైన ఇష్టం. 
విదేశీ భామ స్పెషల్ ఎట్రాక్షన్
ఇప్పుడు ‘ఆర్ ఆర్ ఆర్’ కోసం నిర్మించిన తనకొత్త ఆఫీసును మండువా ఆకారంలో నిర్మించు కున్నాడు. ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ స్పాట్ కు కేవలం ఐదు నిముషాల పాటు నడిచేందుకు వీలుగా ఉండే దూరంలో ఈమండువా ఇల్లు ఉంటుందని సమాచారం. ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాకు సంబంధించిన షూటింగ్ గ్యాప్ లో రాజమౌళి తన డైరెక్టర్స్ టీమ్ తో అదేవిధంగా ఈసినిమాలోని నటీనటులతో ఈసినిమాకు సంబంధించి తదుపరి సీన్ ఎలాతీయాలి అన్న విషయం పై ఈఆఫీసులో చర్చలు జరుగుతాయట. 
2020 వేసవికి రిలీజ్
ఈమండువా ఇంటిలో రాజమౌళి అదేవిధంగా ఈసినిమాలో నటించే కీలక నటీనటుల విశ్రాంతి కోసం వేరువేరు ఫర్నిచర్ తో కూడిన రెస్ట్ రూమ్స్ నిర్మించినట్లు సమాచారం. అంతేకాదు ఈ మండువా ఇంటిలో ఒక పెద్ద డైనింగ్ రూమ్ కూడ ఏర్పాటు చేసి అక్కడే ఈసినిమాకు సంబంధించిన యూనిట్ సభ్యులు అందరూ కలిసి భోజనం చేసే విధంగా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. దీనికి అనుబంధంగా మరొక ప్రత్యేకమైన రూమ్ ను ఏర్పాటు చేసి ఆ రూమ్ లో ఈసినిమాకు సంబంధించిన కాస్ట్యూమ్స్ వ్యవహారాన్ని రాజమౌళి భార్య రమా రాజమౌళి పర్యవేక్షిస్తుంది అని తెలుస్తోంది. 
Rajamouli's RRR Movie Launch Photos
ఈ మండువా ఇంటిచుట్టూ రకరకాల పూల మొక్కలు పెంచడంతో ఆమండువా ఇల్లు పల్లెటూరి వాతావరణంలో కనిపిస్తుందని సమాచారం. ఇదే మండువా ఇంటిలో ఏర్పాటు చేసిన ఒకపెద్ద స్పెషల్ రూమ్ లో చరణ్ జూనియర్ లకు ప్రతిరోజు ఫైటింగ్ సీన్స్ లో శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకమైన ట్రైనర్స్ ను ఏర్పాటు చేసి ఆ ట్రైనింగ్ అంతా రాజమౌళి పర్యవేక్షణలో జరుగుతుందని టాక్. ఇలా మొత్తం ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ అంతా ఒక కుటుంబ వాతావరణంలో జరుగుతూ ఏవియంలోను రాజీ పడకుండా 2020 సంవత్సరంనాటికి విడుదల చేయాలి అన్నపట్టుదలతో రాజమౌళి నిర్మించుకున్న ఈమండువా ఇల్లు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో హాట్ న్యూస్..  


మరింత సమాచారం తెలుసుకోండి: