ఈ మద్య సినీ ఇండస్ట్రీలో వరుసగా బయోపిక్ సినిమాలు వరుసగా వస్తున్నాయి.  ఇప్పటికే తెలుగులో ‘మహానటి’సినిమా సూపర్ హిట్ అయ్యింది.  బాలీవుడ్ లో స్టార్ క్రికెటర్ దోనీ, ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా ‘సంజు’బయోపిక్ లు వచ్చాయి.  ఈ రెండు సినిమాలు కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి.  ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ‘ఎన్టీఆర్ ’బయోపిక్ రూపొందుతుంది.  ఈ సినిమా రెండు భాగాలుగా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ లోకనాయకుడు’గా జనవరిలో రిలీజ్ చేయబోతున్నారు.

మరోవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ‘యాత్ర’ సినిమా తీస్తున్నారు.  ఈ సినిమాలో మాలీవుడ్ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు.  ఈ సినిమాకు మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ నేపథ్యంలో  తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జీవితంపై బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 
Image result for ఉద్యమ సింహం
‘ఉద్యమ సింహం’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం విడుదల చేసింది. కేసీఆర్ బాల్యం నుంచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధన సహా పలు అంశాలను ఈ సినిమాలో చూపించనున్నారు.  న‌ట‌రాజ‌న్ (గిల్లిరాజా), సూర్య‌, పి.ఆర్.విఠ‌ల్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.  అల్లూరి కృష్ణంరాజు దర్శక‌త్వం వ‌హిస్తున్నారు.  ముఖ్య అతిథిగా విచ్చేసిన నిర్మాత రాజ్ కందుకూరి పోస్టర్‌ను ఆవిష్కరించారు.  

KCR Biopic Udyama Simham Movie First Look And Poster Launch - Sakshi

సినీ నిర్మాత నాగేశ్వరరావు మాట్లాడుతూ..ఈ సినిమా జూన్ లో ప్రారంభించామని.. మంచి అవుట్ ఫుట్ వ‌చ్చింది. టెక్నిక‌ల్ గాను సినిమా బాగా వ‌స్తోంది. 16న ఆడియా విడుద‌ల చేస్తాం. అతిత్వరలోనే సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని అన్నారు.  


 ద‌ర్శకుడు అల్లూరి కృష్ణంరాజు మాట్లాడుతూ..ఈ సినిమా కథ చాలా బాగుందని.. కేసీఆర్ గురించి ప్రజల‌కు తెలియని ఎన్నో విష‌యాలో సినిమాలో చూపించ‌బోతున్నాం. సినిమా నిర్మాణానికి నాగేశ్వరరావు ఎక్కడా రాజీప‌డ‌లేదు. ఎంతో ఫ్యాష‌న్ తో సినిమా నిర్మిస్తున్నామన్నారు.  ఈనెల 16న‌ ఆడియో రిలీజ్ చేస్తున్నాం. ఆరోజున కేసీఆర్ పాత్ర ఎవ‌రు పోషిస్తున్నారు?  మిగ‌తా న‌టీన‌టులు ఎవ‌రు? అనేది  రివీల్ చేస్తాం` అని అన్నారు. 


ఈ సినిమాలో జెన్నీ, సి.హెచ్.పి.విఠ‌ల్, ఆకేళ్ల గోపాల‌కృష్ణ‌, గిరిధ‌ర్, జ‌ల‌గం సుధీర్, మాధ‌విరెడ్డి, ల‌త తదితరులు న‌టిస్తున్నారు. ఈ సినిమాకి పాట‌లు:  సి.హెచ్. రాములు, కొరియోగ్రఫీ: గ‌ణేష్, ఫైట్స్:  సూప‌ర్ ఆనంద్, ఎడిటింగ్: న‌ంద‌మూరి హ‌రి, సినిమాటోగ్రఫి: ఉద‌య్ కుమార్, సంగీతం:  దిలీప్ బండారి, మాట‌లు: రాపోలు కృష్ణ అందిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: