భానుమతి అందానికి రారాణి. అతిశయానికి కూడా మహరాణి. అటువంటి ఆ సౌందర్యరాశిని వశపరచుకోవడం అంటే ఆషా మాషీ వ్యవహారం కానే కాదు. కానీ మన బాలయ్య మాత్రం ఆ రహస్యాన్ని చేదించాడు. భానుమతీ పోగొట్టావే మతీ అంటూ రాగాలాపనా చేశాడు. భళారే ఇది విచిత్రమే అంటూ అందాలను పొగిడే పనిలోనూ పడ్డాడు. ఇదంతా వెండి తేర మీద వీక్షించేందుకు మనమంతా వెయిట్ చేయాల్సిందే. 


అన్న నందమూరి తారకరామారావు  జీవిత కధల్తో ఎన్టీఆర్ మూవీని తీస్తున్న సంగతి విధితమే. ఈ మూవీలో తన తండ్రి  ఎన్టీఆర్ గా బాలకృష్ణ నటిస్తున్నారు. అంతేనా నందమూరి పాత్ర పోషణ చేసి భళీ అనిపించుకున్న ఎన్నో మరపురాని పాత్రలను బాలయ్య తిరిగి పోషిస్తూ జనానికి గుర్తు చేస్తున్నారు. అందులో భాగంగా  సూపర్ హిట్ మూవీ దాన వీర శూర కర్ణ సినిమాలో అన్న గారి ధుర్యోదనుని గెటప్. అలాగే ఆయన భానుమతితో కలసి పాడిన డ్యూయట్. ఇందులో ధుర్యధనుని సతీమణి భానుమతిగా ప్రభ నటించి మెప్పించింది. ఇపుడు బాలయ్యకు జోడీ ఎవరో  చూడాలి.


ఇక ఇదే సినిమాలో కర్ణుడిగా కూడా బాలయ్య కనిపిస్తూంటే, అర్జునుడిగా హరిక్రిష్ణ పాత్రలో ఆయన కుమారుడు కళ్యాణ్ రామ్  కనిపిస్తారట. ఈ ఇద్దరి మధ్యన వచ్చే సన్నివేశాలు అభిమానులను ఉర్రూతలూగిస్తాయాని అంటున్నారు. మొత్తానికి ఎన్నో వింతలు, విశేషాలతో ఎన్టీఆర్ మూవీ తయారవుతోంది. సంక్రాంతికి సందడే మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: