రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ కేవలం లాంఛనంగా మాత్రమే ప్రారంభమైంది. ఈమూవీ షూటింగ్ కనీసం సంవత్సరం పైగా కొనసాగి అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 2020 లో మాత్రమే విడుదల అవుతుంది. అయితే ఈమూవీకి సంబంధించిన వార్తలతో అప్పుడే మీడియా హోరెత్తి పోతోంది. 
పనిరాక్షసుడు
చరిత్ర సృష్టించిన ‘బాహుబలి’ మూవీలో రాజమౌళి క్రియేట్ చేయించిన ‘కిరికిరి’ భాష ఒక సంచలనం.  ఈభాషకు సంబంధించి ఆలోచన రాజమౌళిది అయినా కిరికిరి భాషను సృష్టించింది మాత్రం తమిళ రచయిత మదన్ కార్కి. ఇప్పుడు ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించి రాజమౌళి ట్రైబల్ భాషను క్రియేట్ చేసే పనిలో బిజీగా ఉన్నట్లు టాక్. 
 అటవీ నేపథ్యంలో
ఈసినిమా కథ రీత్యా కొంత భాగం దట్టమైన అరణ్యాలలో జరుగుతుంది. దీనితో అరణ్య ప్రాంతాలలో గిరిజనులు మాట్లాడుకునే ఒక ట్రైబల్ భాషను రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో ప్రయోగించబోతున్నట్లు టాక్. అయితే భారత దేశంలో ఇప్పటికే ఎంతో ప్రాచూర్యం పొందిన ఒక ట్రైబల్ భాషను యధాతధంగా ‘ఆర్ ఆర్ ఆర్’ లో ఉపయోగించాలా లేదంటే ఒక సరికొత్త ట్రైబల్ భాషను సృష్టిస్తే ఎలా ఉంటుంది అన్న విషయమై రాజమౌళి ప్రస్తుతం ట్రైబల్ భాషకు సంబంధించిన భాషా వేత్తలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. 
 ప్రత్యేక గదులు
ఈసినిమాలో ఉపయోగించబోయే ట్రైబల్ భాష ఫైనల్ అయినతరువాత చరణ్ జూనియర్ లకు ఈభాషలో శిక్షణ ఇప్పించే ఆలోచన కూడ రాజమౌళి చేస్తున్నట్లు టాక్. ఇలా రోజుకు ఒక షాకింగ్ న్యూస్ ఈమూవీ గురించి లీకులు వస్తున్న నేపధ్యంలో రాజమౌళి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండానే తన ‘ఆర్ ఆర్ ఆర్’ కోట్లు విలువ చేసే ఫ్రీ పబ్లిసిటీ వచ్చేలా చేస్తున్నాడనుకోవాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: