ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ పెళ్లిళ్ల హంగామా కొనసాగుతోంది. దీపికా పదుకోనె రణవీర్ సింగ్ ల పెళ్ళి ఫోటోలు వార్తల గురించి మీడియా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ పెళ్ళి హంగామా ముగిసిన వెంటనే మరో టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా లైన్ లోకి రాబోతోంది. 

అమెరికాకు చెందిన నిక్ జోనస్ తో ఇప్పటికే ప్రియాంకకు నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. తనకన్నా చాలా చిన్నవాడు అయిన నిక్ ను ప్రియాంక పెళ్లి చేసుకోబోతోందనేది తెలిసి బాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు మీడియా వర్గాలు కూడ చాల ఆశ్చర్యపోయాయి. 

అయితే వీరిద్దరి పెళ్లి సింపుల్ గా కాకుండా అత్యంత ఘనంగా జరుపుకునే విధంగా ప్రియాంక ప్లాన్ చేస్తోంది. బాలీవుడ్ మీడియా వ్రాస్తున్న వార్తల ప్రకారం వీరిద్దరి పెళ్లి డిసెంబర్ లో జరగబోతోంది అని టాక్. ఏకంగా మూడు రోజుల పాటు అత్యంత ఘనంగా జరగబోయే ఈ పెళ్లికి బాలీవుడ్ ప్రముఖులతో పాటు హాలీవుడ్ నుంచి కూడ అతిధులు రాబోతున్నట్లు టాక్. 

దీనితో బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ఖరీదైన పెళ్ళిగా మారబోతున్న ప్రియాంక పెళ్లి వీదియాలకు అదేవిధంగా ఫోటోలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడటంతో ఒక ప్రముఖ హిందీ ఛానల్ ప్రియాంక పెళ్లి రిసేప్క్షన్ కు సంబంధించిన వార్తల ప్రసారానికి సంబంధించిన హక్కులతో పాటు ఆమె పెళ్లి ఫోటోలను కూడ 18 కోట్లు చెల్లించి ప్రియాంక మ్యారేజ్ టెలికాస్ట్ రైట్స్ ను టోటల్ గా కోనేసినట్లు బాలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది. దీనితో తన పెళ్లి ఫోటోలతో కూడ బిజినెస్ చేయగల క్రేజీ బ్యూటీగా ప్రియాంక చోప్రా మారిపోయింది అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: