రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రారంభం పూర్తి కావడంతో ఈనెల 19 నుండి ఈసినిమాకు సంబంధించిన భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరణ ప్రారంభం కాబోతోంది. సుమారు పది రోజులపాటు జరిగే ఈ షెడ్యూల్ లో ఈమూవీ కథకు సంబంధించి ఎటువంటి సీన్స్ చిత్రీకరించకుండా కేవలం యాక్షన్ సీన్స్ మాత్రమే భారీ స్థాయిలో రాజమౌళి చిత్రీకరించబోతున్నాడు. 
ఎలా ఉంటుందో ఊహించుకోండి
వాస్తవానికి రాజమౌళి అనేక ఆలోచనలు తరువాత ఈమూవీకి హీరోయిన్స్ గా కీర్తి సురేశ్ కైరా అద్వానీల ఎంపికను దాదాపు ఖరార్ చేసినప్పటికీ ఈమూవీలో హీరోలుగా నటిస్తున్న చరణ్ జూనియర్ ల ప్రక్కన కీర్తి సురేశ్ కైరా అద్వానీలలో ఎవరు ఎవరికీ మ్యాచ్ అవుతారు అన్న విషయంలో రాజమౌళికి కొన్ని సందేహాలు ఉన్నట్లు సమాచారం. ముందుగా ఈ హీరోయిన్స్ ఎంపికలో రాశి ఖన్నా పేరు కూడ రాజమౌళి దృష్టికి వచ్చినప్పటికీ అది కేవలం ప్రాధమిక ఆలోచనగా మాత్రమే మిగిలిపోయిందని టాక్. 
బాహుబలి రికార్డులు
దీనికితోడు ఈసినిమా చాల కాలం చిత్రీకరణ జరపబడే నేపధ్యంలో రాజమౌళి కోరుకునే బల్క్ డేట్స్ ఎంత వరకు కీర్తి సురేశ్ కైరా అద్వానీలు సద్దుబాటు చేస్తారు అన్న సందేహాలు కూడ రాజమౌళిని వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీలో చాల బిజీ హీరోయిన్స్ గా వీరిద్దరూ కొనసాగుతున్న నేపధ్యంలో రాజమౌళి పెట్టె కండిషన్స్ ఒప్పుకోవడం బట్టి వీరిద్దరి ఎంపిక ఉంటుంది అని అంటున్నారు. 
నన్ను తిడుతున్న వాళ్ళు కూడా
దీనికితోడు ఈసినిమా ఇంకా షూటింగ్ ప్రారంభం కాకుండానే ఈమూవీ పై పెరిగిపోతున్న అంచనాలు రాజమౌళికి ఆనందం కన్నా టెన్షన్ ను ఎక్కువగా కలిగిస్తున్నట్లు సమాచారం. దీనితో ఇప్పటికే పెరిగిపోయిన ఈమూవీ అంచనాలను మరింత పెరగకుండా కొన్ని నెలల పాటు ఈమూవీ గురించి ఎటువంటి లీకులు లేకుండా చాల రహస్యంగా ఈమూవీ చిత్రీకరణను నడిపించాలని రాజమౌళి ఆలోచన అని అంటున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న ‘రామ రావణ రాజ్యం’ టైటిల్ రాజమౌళికి నచ్చినా ఎవరు ఊహించని విధంగా ఈమూవీ టైటిల్ ఉండాలని తీవ్ర కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం..  


మరింత సమాచారం తెలుసుకోండి: