తెలుగు ఇండస్ట్రీలో దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మాస్ మహరాజ రవితేజ ‘రాజా ది గ్రేట్’ చిత్రంతో మళ్లీ తెరపై కనిపించారు.  ఈ చిత్రంలో రవితేజ అంధుడిగా కనిపించినా తనదైన హీరోయిజం మార్క్ చూపించాడు.  ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ తర్వాత టచ్ చేసి చూడు, నెల టిక్కెట్టు అట్టర్ ఫ్లాప్స్ అయ్యాయి. దాంతో గతంలో తనకు సూపర్ హిట్స్ అందించిన క్రేజీ డైరెక్టర్ శ్రీనువైట్లను నమ్ముకున్నాడు.  వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోని’.   శ్రీనువైట్ల, రవితేజ కాంబినేషన్‌లో వస్తోన్న నాలుగో సినిమా ఇది. ఈ సినిమాకు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు.  'అమర్ అక్బర్ ఆంటోని' చిత్రం ఈ  నెల 16వ తేదీన విడుదల కానుంది.

Related image

తాజాగా ఈ చిత్రం ప్రమోషన్ లో బాగంగా దర్శకుడు శ్రీను వైట్ల ఎన్నో విషయాలు మీడియాకు వెల్లడించారు. మామూలు గా ఎవరైనా మిస్టేక్స్ నుంచే ఎక్కువ నేర్చుకుంటారు. అలా నేర్చుకోవడం నాకూ అవసరం. లేకపోతే అక్కడే ఉంటాం. నేను ఎక్కడ తప్పు జరుగుతుందనే విషయంలో రియలైజ్ అయ్యాను. అందుకే పీక్స్‌లో ఉన్నప్పుడు ఎలా పనిచేశానో అలాగే చేశా. అంతకు మించి పనిచేశా అన్నారు.  మొదటి నుంచి కూడా నాచిత్రాల విజయంలో కామెడీ ప్రధాన బలంగా నిలిచింది. అయితే మధ్యలో నా మార్క్ కామెడీ రొటీన్ అవుతుందేమోననే కామెడీపాళ్లు తగ్గించి కొత్తగా ట్రై చేశాను. దాంతో ఆ సినిమాలు నిరాశ పరిచాయి.  

Image result for raviteja amar akbar anthony postes

నా చిత్రాల్లో నా మార్క్ కామెడీనే ఆడియన్స్ ఎక్కువగా ఎంజాయ్ చేస్తారని సన్నిహితులు చెప్పారు. సోషల్ మీడియా ద్వారా అభిమానులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే నిర్మాతలు వారు పెట్టిన ఖర్చుకు తగ్గ ఔట్‌పుట్ వచ్చిందని ఆనందంతో కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. కథకు తగ్గ టైటిల్ అమర్ అక్బర్ ఆంటోనీ. నా తొలి చిత్రం రూ.38లక్షల్లో చేశా. ఆ తర్వాత అలా చేస్తూ చేస్తూ ఒక స్థాయికి వచ్చాను. ఇప్పుడు ఒకవేళ ఏదైనా ఫ్లాష్‌లా గా ఆలోచన వస్తే నేను చిన్న బడ్జెట్ చిత్రాన్ని చేయడా నికి వెనకాడను. నేనెప్పుడూ కీర్తి కోసం పాకులాడలేదు. రవితేజ, నేను ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం.

Image result for raviteja amar akbar anthony postes

నేను లోలో ఉన్న ప్రతిసారీ తను నాకు ట్రబుల్ షూటర్ అయ్యాడు. నేను తనని హీరోగా, తను నన్ను దర్శకుడిగా ఎప్పుడూ చూడలేదు. మేమిద్దరం కలిస్తే అల్లరిగా ఉంటుంది.ఈ పాత్రను రాసుకున్నప్పుడు హీరోగా రవితేజ, హీరోయిన్‌గా ఇలియానా అని అనుకునే రాసుకున్నా. అయితే ఇలియానా తెలుగు చిత్రాలు చేయడం లేదని మైత్రీ మూవీస్ వారు అన్నారు. మొత్తానికి ప్రేక్షకులు ఆశించినట్లుగా  'అమర్ అక్బర్ ఆంటోని' నా మార్క్  కామెడీతోనే నవ్విస్తారు. ఈ సారి ప్రేక్షకులు విజయాన్ని అందిస్తారనే నమ్మకం వుంది" అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. మరి ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: