బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న మెగా మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్. పరిశ్రమలోని పెద్దలంతా ఒక చోట చేరి ఈ సినిమాకు ముహుర్తం పెట్టారు. ఇది మరో బాహుబలి కాదు కాదు అంతకుమించిన సినిమా అవ్వాలని ఆకాంక్షించారు. సోలో హీరోతోనే సంచలనాలు సృష్టించే రాజమౌళి ఇద్దరు సూపర్ స్టార్ తో ఎలాంటి సినిమా చేస్తాడో అని ఇద్దరి హీరోల ఫ్యాన్స్ ఆకాశాన్నంటే అంచనాలు ఏర్పరచుకున్నారు.


పిరియాడికల్ మూవీగా రాబోతున్న ఈ సినిమా రాజమౌళి ఎలా తీస్తాడు.. ఇద్దరు హీరోలను కాదు కాదు వారి ఫ్యాన్స్ ను ఎలా మేనేజ్ చేస్తాడు అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. అసలే మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అనుకునే ఈరోజుల్లో ఇద్దరు స్టార్స్ ను పెట్టి రాజమౌళి పెద్ద సాహసమే చేస్తున్నాడని చెప్పొచ్చు.  


అయితే ఇందులో ఎవరి పాత్ర ఏ కొంచం తగ్గినట్టు అనిపించినా అభిమానుల తాకిడికి రాజమౌళి తట్టుకోవాల్సి ఉంటుంది. ఎన్.టి.ఆర్ నెగటివ్ షేడ్స్ అన్ని ముందు నుండి హింట్ ఇస్తుండగా రాముడిగా రాం చరణ్ రచ్చ చేయడం ఖాయమని అంటున్నారు. ఇద్దరు మంచి ఫాంలో ఉన్న హీరోలను వారి రేంజ్ ను మరింత పెంచేలా రాజమౌళి ట్రిపుల్ ఆర్ తీస్తాడని అంటున్నారు.     


300 కోట్ల సినిమా అని చెబుతున్నా తెలుగు పరిశ్రమ నుండి వచ్చే రెండో భారీ బడ్జెట్ మూవీగా బాహుబలి తర్వాత స్థానంలో ఉంది ఆర్.ఆర్.ఆర్. ఇక కలక్షన్స్ లో కూడా ఈ సినిమా ఆ రేంజ్ అందుకుని మరోసారి తెలుగు సినిమా స్టామినాను అందరికి తెలిసేలా చేస్తుందని ఆశిద్ధాం. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ 19 నుండి రెగ్యులర్ షూట్ కు వెళ్తుంది. 2020 సమ్మర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.



మరింత సమాచారం తెలుసుకోండి: