ఇండియా లో మీ టూ ఉద్యమం ఊపందుకోవడం తో సినీ ఇండస్ట్రీ లో జరిగిన చేదు అనుభవాలను బయట పెడుతున్నారు. బాలీవుడ్ లో తనుశ్రీ దత్త నానా పాటేకర్ పై చేసిన వ్యాఖ్యలతో పేరు దుమారం మొదలయింది. అదే స్పూర్తితో సౌత్ హీరోయిన్లు కూడా తనకు జరిగిన లైంగిక వేధింపుల గురించి ముందుకొచ్చి మాట్లాడారు. శృతి హరిహరన్, సీనియర్ నటుడు అర్జున్ వ్యవహారంలో కేసు కోర్టువరకు వెళ్లిన సంగతి తెలిసిందే. హాట్ హీరోయిన్ సంజన మాత్రం చివరి నిమిషంలో చేతులెత్తేసింది. 

కన్నడ ఫిలిం ఛాంబర్

రవి శ్రీవత్స దర్శత్వం వహించిన గండ హెండతి చిత్ర విషయంలో తనకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని సంజన ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ముద్దు సన్నివేశాలు, శృంగార సన్నివేశాల పేరుతో దర్శకుడు తనని వేధించాడని సంజన ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీనితో కన్నడ చిత్ర పరిశ్రమలో దుమారం మొదలైంది. ఈ చిత్రంలో కేవలం ఒకే ముద్దు ఉంటుందని దర్శకుడు చెప్పారు.

గండ హెండతి సినిమాలో

ఆ మేరకు మాత్రమే మా మధ్య ఒప్పందం జరిగింది. కానీ చిత్రీకరణ సమయంలో మాత్రం ఎక్కడ పడితే అక్కడ కెమెరాలు పెడుతూ 15 ముద్దు సీన్లు చిత్రీకరించారని సంజన పేర్కొంది. అడ్డు చెబితే నీకు ఇండస్ట్రీలో భవిష్యత్తు ఉండదని బెదిరించారని పేర్కొంది. ఇండస్ట్రీకి కొత్త కావడంతో అప్పుడు నేను ఏమిచేయలేకపోయా అంటూ సంజన మీటూ ఉద్యమం నేపథ్యంలో ఘాటు వ్యాఖ్యలు చేసింది. సంజన వ్యాఖ్యలు కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించాయి. దర్శకులంతా సంజన కామెంట్స్ విషయంలో ఫిలిం ఛాంబర్ లో సమావేసం నిర్వహించారు. అసత్య ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. సంజన దిగివచ్చి క్షమాపణలు కోరేవరకు మరే చిత్రంలో ఆమెకు అవకాశం కల్పించకుండదని నిర్ణయం తీసుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: