‘అరవింద సమేత’ మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా ఈమూవీ బయ్యర్లకు ఎంతో కొంత కనీస నష్టాన్ని మిగిల్చింది. దీనికి కారణం ‘అరవింద సమేత’ పై త్రివిక్రమ్ పెట్టిన మితిమీరిన ఖర్చు. దీనితో అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ తీయబోయే సినిమాలో బడ్జెట్ కంట్రోల్ లో పెట్టమని బన్నీ త్రివిక్రమ్ కు సున్నితంగా సూచించినట్లు టాక్. 

దీనికితోడు అల్లు అర్జున్ కు సరిపడే స్టోరీ లైన్ ప్రస్తుతం త్రివిక్రమ్ దగ్గర లేకపోవడంతో మాటల మాంత్రికుడు తన టీమ్ తో బన్నీని మెప్పించే కథ గురించి అన్వేషణ చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి అల్లు అర్జున్ మనసు బాలీవుడ్ మూవీ ‘సోను కి టిటు కి స్వీటీ’ పై ఉన్నా ఆమూవీ అల్లు అర్జున్ కు పూర్తిగా నప్పదని వేరే కథ ఆలోచిస్తానని త్రివిక్రమ్ సమయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

అయితే ఈ చర్చలు జరిగి సుమారు ఒక నెల రోజులు కావలసి వస్తున్నా త్రివిక్రమ్ పూర్తి కథతో ఇంకా బన్నీ వెళ్ళ లేదని సమాచారం. దీనితో అల్లు అర్జున్ కేవలం తన హెయిర్ స్టైల్ ను మార్చుకుని మిగతా విషయాల కోసం త్రివిక్రమ్ వంక చూస్తున్నట్లు టాక్. 

పదునైన మాటలు వ్రాయడంలో పేరు గాంచిన త్రివిక్రమ్ కు గతకొంత కాలంగా కథలను సృష్టించడంలో వెనకబడిపోతున్నాడు అన్న కామెంట్స్ ఉన్నాయి. ‘అరవింద సమేత’ త్రివిక్రమ్ కు నిరాశను పోగొట్టింది కానీ పూర్తి మనోధైర్యాన్ని ఇవ్వలేకపోయింది. దీనితో త్రివిక్రమ్ బన్నీ కోసం తయారు చేసే కథ పూర్తి కావడానికి మరో నెల రోజులు పట్టినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. అప్పటి వరకు బన్నీకి ఈ వెయిటింగ్ మరో మార్గం లేదు..  


మరింత సమాచారం తెలుసుకోండి: