ఈ వీకెండ్ కి రెండు మూవీస్ జనం తీర్పు కోసం వస్తున్నాయి. అందులో ఒకటి సీనియర్ హీరోదైతే, మరోకటి అప్ కమింగ్ హీరోది. ఈ రెండు మూవీస్ మీద పెద్దగా అంచనాలు లేకపోవడం విశేషం. అయితే ఓ వైపు వెదర్ కూల్ గా ఉండడం, పిక్నిక్కుల మంత్ కావడం, ధియేటర్లు అన్నీ ఖాళీగా ఉండడం ఈ రెండు సినిమాలకు ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోటీగా మ‌రో మూవీ లేని టైంలో ఏ మాత్రం బజ్ వచ్చినా హిట్ టాక్ అందుకోవడం ష్యూర్ గా కనిపిస్తోంది.


ముందుగా సీనియర్ హీరో రవితేజా మూవీ 16న రిలీజ్ అవుతోంది. అమర్ అక్బర్ ఆంతోనీ. టైటిల్ లో ఓల్డ్ లుక్ ఉన్నా రవితేజా, శ్రీను వైట్ల కాంబో మీదనే ఆశలు ఉన్నాయి. ఇక చూసుకుంటే రవితేజా ట్రాక్ రికార్డ్ ఇపుడు ఏమంత బాగాలేదు. నేల టికెట్, టచ్ చేసి చూడు వరసగా ఫ్లాప్ అయ్యాయి. మరో వైపు డైరెక్టర్ శ్రీను వైట్లది  కూడా అదే సీన్. చేతిలో హిట్లు లేని ఈ ఇద్దరూ కలసి చెసిన మూవీ ఇది. అయితే మూవీపై హీరో, డైరెక్టర్ ఇద్దరూ కూడా మంచి కాంఫిడెన్స్ గా ఉన్నారు.

హిలేరియస్ కామెడీని దట్టించి వదిలారని ఇన్నర్ టాక్. ఇక రవితేజాను ఫుల్లుగా వాడేసుకున్నానని, అదంతా తెరపై కనిపిస్తునదని శ్రీను వైట్ల చెబుతున్నాడు. చాలాకాలానికి ఇలియానా మళ్ళీ తెలుగు తెరపైన కనిపించడం ఓ ప్లస్ పాయింట్.


మరో మూవీ విజయ్ దేవరకొండది. టాక్సీ వాలా మూవీ ఈ నెల 17న‌ విడుదల అవుతోంది. ఈ మూవీతో మాస్ అప్పీల్ కి విజయ్ ట్రై చేశాడు. అయితే విజయ్ కి కూడా నోటా ఫ్లాప్ ఉంది. గీతాగోవిందం సక్సెస్ కంటిన్యూ అవలేదు మరి. టాక్సీ వాలా ఏ రిజల్ట్ ఇస్తుందో చూడాలి. ఈ రెండు మూవీస్ ఒకదానికి ఒకటి పోటీ కావు, కానీ జనం ఆదరణ దేనికి ఉంటుందన్నది మాత్రం చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: