టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించిన సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక లో వేదికపై కాజల్ అగర్వాల్ ప్రసంగిస్తుండగా సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు ఒక్కసారిగా కాజల్ బుగ్గలపై గట్టి ముద్దు పెట్టిన సన్నివేశం సోషల్ మీడియా లో రచ్చ రచ్చ చేస్తున్న నేపథ్యంలో చాలా మంది నెటిజన్లు చోటా కె నాయుడు పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

Image result for chota k naidu soundarya

దీంతో విషయం మరింత ముదురుతున్న నేపద్యంలో చోట కే నాయుడు తనదైన శైలిలో స్పందించారు. అలనాటి అందాల నటి సౌందర్య తన ఫేవరేట్ హీరోయిన్ అని ఆమెను తలచుకొని భావోద్వేగానికి లోనయ్యాను..కాజల్ కూడా సౌందర్య వంటి అందం కలిగిన హీరోయిన్ అని..కాజల్ లో ఎప్పుడు నా ఫేవరెట్ హీరోయిన్ సౌందర్యాన్ని చూసుకుంటానని..కాజల్ హీరోయిన్ గా చేసిన చాలా చిత్రాలకు కెమెరామెన్ గా పని చేసానని అన్నారు.

Related image

ఆమె చాల గొప్ప నటి అని పొగిడారు. ఆమెతో ఎప్పుడు పనిచేసినా సంతోషంగా అనిపిస్తుంది అన్నారు. కాజల్ నన్ను తన కుటుంబ సభ్యుడిలాగే అనుకుంటుంది, మా ఇద్దరి మధ్య అంత బాండింగ్ ఉందని ఛోటా అన్నారు.

Image result for chota k naidu soundarya

కాజల్ ను ముద్దాడిన విషయంలో సమర్ధించుకున్న ఛోటా, కాజల్ ను అభినందించడానికి అలా ముద్దు పెట్టుకున్నా అని వివరణ ఇచ్చారు.



మరింత సమాచారం తెలుసుకోండి: