కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తమిళంలో సూపర్ హీరో.. తమిళంలో రజినికి సరిసమానంగా ఫాలోయింగ్ తెచ్చుకున్న విజయ్ తన ప్రతి సినిమాతో సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ నటించిన సర్కార్ సినిమా తమిళాట విజయ దుంధుంభి మోగిస్తుంది. అయితే ఈ సినిమా వసూళ్లతో పాటుగా వివాదాలను మూటకట్టుకుంది.


ఇదిలాఉంటే విజయ్ సర్కార్ సినిమా తన పాతికేళ్ల కల నెరవేర్చిందని తెలుస్తుంది. తమిళ స్టార్ హీరోకి విజయ్ పాతికేల్ల కల అదేంటి అంటే తెలుగులో ఇప్పటికే తమిళ హీరోల హవా కొనసాగిస్తున్నారని తెలిసిందే. రజిని, కమల్ తర్వాత విక్రం, సూర్య, కార్తి, విశాల్ లు టాలీవుడ్ బాక్సాఫీస్ పై సత్తా చాటుతున్నారు.


ఇక ఇప్పుడు విజయ్ వంతు వచ్చింది. తను హీరో అయిన 25 ఏళ్లకు తెలుగులో విజయ్ సూపర్ హిట్ అందుకున్నాడు. తెలుగులో పెద్దగా మార్కెట్ లేని విజయ్ తుపాకి, పోలీస్, అదిరింది సినిమాలతో వచ్చాడు. అయితే ఆ సినిమాలేవి పెద్దగా లాభాలు తీసుకురాలేదు. కాని సర్కార్ మాత్రం తెలుగులో కూడా విజయ్ కు సూపర్ హిట్ తెచ్చిపెట్టింది.


అశోక్ వల్లభనేని తెలుగులో సర్కార్ సినిమాను రిలీజ్ చేశారు. మురుగదాస్ డైరక్షన్ లో వచ్చిన ఈ సర్కార్ సినిమా 7 కోట్లకు కొన్న అశోక్ వల్లభనేని ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దాటేశాడని తెలుస్తుంది. పోటీగా ఏ సినిమా లేకపోవడం వల్ల విజయ్ సర్కార్ తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. ఒకవేళ తెలుగు మార్కెట్ మీద కూడా విజయ్ దృష్టి పెడితే అతని క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది.   



మరింత సమాచారం తెలుసుకోండి: