తమిళ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ అయిన శంకర్ ఇప్పటి వరకు ఎన్నో అదర్భుతమైన చిత్రాలు అందించారు.  ఆయన తీసిన చిత్రాలన్నీ తెలుగు లో డబ్ అవడమే కాదు ఇక్కడ కూడా సూపర్ హిట్ అయ్యాయి.  విశ్వనటుడు కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ‘భారతీయుడు’ 1996 లో రిలీజ్ అయ్యింది. లంచగొండి తనంపై ఓ స్వతంత్ర సమరయోధుడు పూరించిన శంకారవమే ఈ చిత్రం సారాంశం. 

లంచం తీసుకున్నాడని తన కొడుకును సైతం చంపేసే సేనాపతి పాత్రలో కమల్ హాసన్ విశ్వరూపం చూపించాడు.  అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ లుక్ లో ముసలివాడిగా కనిపించాడు.  తాజాగా ఇండియన్ సీక్వెల్‌గా ఇండియన్ 2 తెరకెక్కించబోతున్నారు.  ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతుంది.  ఇప్పటికే సూపర్ స్టార్ రజినీకాంత్ తో 2.ఒ చిత్రాన్ని పూర్తి చేసిన శంకర్ ఈ చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్ తో తీయబోతున్నట్లు సమాచారం. 

 ఈ చిత్రంలో  కమల్ హాసన్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. దుల్కర్ సల్మాన్‌ మరో కీలక పాత్రలో నటించనున్నాడు. అలాగే కోలీవుడ్ హీరో శింబు పోలీస్ పాత్రలో నటించనున్నాడు. ఇక ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా.. అనిరుధ్ సంగీతం అందించనున్నాడు.  అన్నీ కుదిరితే ఈ చిత్రం 2020 లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందట. 


మరింత సమాచారం తెలుసుకోండి: