యువ హీరోల్లో మంచి ఫాంలో ఉన్న విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి, గీతా గోవిందం లాంటి సూపర్ హిట్స్ కొట్టగా ఆ తర్వాత వచ్చిన నోటా మాత్రం నిరాశపరచింది. ఇక ప్రస్తుతం టాక్సీవాలాతో ఈ శనివారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు విజయ్ దేవరకొండ. రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో హర్రర్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ మూవీతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు దేవరకొండ.


ఇక ఈ సినిమా సక్సెస్ మీద భిన్న రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే గీతా గోవిందం తో పాటుగే ఈ టాక్సీవాలా సినిమా కూడా లీక్ అవడం జరిగింది. హెచ్.డి ప్రింట్ బయటకు రావడం జరిగింది. అయితే ఈ సినిమా రిజల్ట్ మీద ఈ పైరసీ ఎఫెక్ట్ పడుతుందని అంటున్నారు. అయితే ఈ టాక్సీవాలా విజయ్ కు అసలు సిసలు పరీక్ష పెట్టబోతుంది. 


విజయ్ నోటా ఫ్లాప్ అవగా ప్రస్తుతం విజయ్ కెరియర్ ఈ టాక్సీవాలా మీద డిపెండ్ అయ్యి ఉందని చెప్పొచ్చు. గీతా ఆర్ట్స్-2, యువి క్రియేషన్స్ బ్యానర్లు కలిసి ఈ సినిమా నిర్మించారు. విజయ్ దేవరకొండకు జోడీగా ప్రియాంకా జవల్కర్ టాక్సీవాలాలో నటించడం జరిగింది. టాక్సీవాలా ట్రైలర్ ప్రేక్షకులను అలరించింది.


లీకుల సంగతి బయటకు రాకుండా సినిమా ప్రమోషస్ బాగానే చేస్తున్నారు. ఇక విజయ్ తో పాటుగా రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. మరి రవితేజను దాటుకుని విజయ్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: