చరణ్ బోయపాటిల కాంబినేషన్ లో రూపొందుతున్న ‘వినయ విధేయ రామ’ మూవీ షూటింగ్ చివరి దశకు వచ్చింది. వచ్చే సంక్రాంతిని టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న ఈమూవీ ప్రమోషన్ ను వచ్చే నెల మూడవ వారం నుండి మొదలు పెట్టబోతున్నారు. 
Chiranjeevi Boyapati Srinu 151th Movie Details Updates
చరణ్ కెరియర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈమూవీ గురించి ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు బయటకు లీక్ అయింది. ఈమూవీ చివరకు 3గంటల 10 నిముషాల నిడివిలోకి తేలుతున్నట్లు సమాచారం. అనేక ట్విస్ట్ లు  భారీ యాక్షన్ సీన్స్ ఈమూవీ కథలో చాల ఎక్కువగా ఉన్న నేపధ్యంలో ఈసినిమాకు ఇంత భారీ నిడివి వచ్చిందని సమాచారం. 
Summary of Chiru's Phone Call to Boyapati
ఈసినిమాకు సంబంధించి ఫైనల్ ఎడిటింగ్ ఇంకా పూర్తి అవ్వకపోయినా ఈమూవీ నిడివి గురించి వస్తున్న వార్తలు విని చిరంజీవి షాక్ అయి బోయపాటిని తన వద్దకు పిలిపించుకుని ఈమూవీ నిడివి గురించి వస్తున్న వార్తల పై వివరణ అడిగినట్లు టాక్. అయితే బోయపాటి ఈమూవీ కథ రీత్యా ఇంత పెద్ద నిడివి వచ్చిందని ‘రంగస్థలం’ ‘అర్జున్ రెడ్డి’ లాంటి సినిమాలు భారీ నిడివి ఉన్నా బ్లాక్ బస్టర్ అయిన విషయాన్ని బోయపాటి చిరంజీవి దృష్టికి తెచ్చినట్లు తెలుస్తోంది. 
Boyapati Srinu meets Chiranjeevi
తెలుస్తున్న సమాచారం మేరకు చిరంజీవి బోయపాటి వాదనతో ఏకీభవించకుండా ఒక మాస్ సినిమాకు ఇంత భారీ నిడివి ఏమాత్రం మంచిది కాదు అన్న స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు టాక్. అంతేకాదు ఈసినిమాను ఎట్టి పరిస్తుతులలోను 2 గంటల 40 నిముషాలకు మించి నిడివి ఉంచవద్దు అని స్పష్టంగా చెప్పడంతో బోయపాటి తాను ఎంతో కష్టపడి తీసిన ఈమూవీలో 30 నిముషాలు ఎక్కడ కట్ చేసుకుని రావాలి అన్న విషయంలో తీవ్ర అంతర్మధనంలో ఉన్నట్లు టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి: