ఫిలిం ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ఒక యంగ్ హీరో క్రేజీ హీరోగా మారడం అందరికీ సాధ్యం అయ్యే పనికాదు. చిరంజీవి తరువాత అటువంటి అదృష్టం విజయ్ దేవరకొండకు కలిగింది. అయితే విజయ్ కు మెగా కాంపౌండ్ ఇస్తున్న మద్దతుతో ప్రస్తుతం ఈ యంగ్ హీరో 'మెగా’ మనిషిగా మారాడు. చిరంజీవి నుండి అల్లు శిరీష్ వరకు విజయ్ దేవరకొండను ఆకాశానికి ఎత్తేస్తూ అవకాసం దొరికినప్పుడల్లా ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈవిషయంలో అల్లు అర్జున్ మరో అడుగు ముందుకు వేసి విజయ్ తన ‘సోల్ మేట్’ అంటూ ఈమధ్య జరిగిన ‘టాక్సీవాలా’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కామెంట్ చేయడం చాలామందిని ఆశ్చర్య పరిచింది. ఒక విధంగా టోటల్ మెగా ఫ్యామిలీ విజయ్ పై ఇలా ప్రేమ కురిపించడం వెనుక ఒక ఆసక్తికర గల కారణం ఉంది అని అంటున్నారు. 
అర్జున్ రెడ్డి’ సూపర్ సక్సస్ తరువాత విజయ్ అల్లు కాంపౌండ్ తో రెండు సినిమాలు చేయడానికి ఒప్పందం చేసుకున్నాడు. ఆ రెండింటిలో ఒకటి ‘గీత గోవిందం’ అయితే మరొకటి ‘టాక్సీ వాలా’ అనుకోని విధంగా ‘గీత గోవిందం’ అల్లు అరవింద్ కు కోట్లు కురిపించింది. ఆతరువాత ఈవారం విడుదల అవుతున్న ‘టాక్సీ వాలా’ కూడ మంచి విజయాన్ని ఇస్తుందని అరవింద్ నమ్ముతున్నాడు. 

ఈ కారణాలతో విజయ్ ను మెగా హీరోగానే భావిస్తూ మెగా హీరోలు అంతా విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు. అయితే విజయ్ కి అల్లు కాంపౌండ్ తో ఉన్న భాంధవ్యం ఈరెండు సినిమాలతో ముగిసిపోతుంది. అయితే ‘టాక్సీవాలా’ విడుదల తరువాత కూడ ఇదే స్థాయిలో మెగా కాంపౌండ్ అల్లు కాంపౌండ్ లు ఇలాగే విజయ్ ని ప్రమోట్ చేస్తారా? లేకుంటే ఇక్కడితో సరిపెదతారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికితోడు విజయ్ పై మెగా కాంపౌండ్ కనపరుస్తున్న విపరీతమైన ప్రేమ వల్ల ఇండస్ట్రీలో మెగా కాంపౌండ్ అంటే గిట్టని కొన్ని వర్గాలు విజయ్ దేవరకొండను అవకాశం దొరికినప్పుడల్లా టార్గెట్ చేస్తూ పరోక్షంగా మెగా కాంపౌండ్ పై తమకు ఉన్న ద్వేషానికి విజయ్ ను బలిపశువుగా చేసే ఆస్కారం ఉంది అంటూ కొందరు విశ్లేషణలు చేస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: