ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి జోరుగా కొనసాగుతుంది.  వచ్చే నెలలోనే తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి. మరో నాలుగు నెలల్లో ఏపిలో ఎన్నికలు జరగబోతున్నాయి.  అయితే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీల నేతలు ప్రచారంలో మునిగిపోయారు.  మరోవైపు ఎన్నికల కమీషన్ ఓటు హక్కు గురించి విరివిగా ప్రచారం కొనసాగిస్తుంది.  ఇందుకోసం ప్రకటనలు కూడా జారీ చేస్తుంది.  ప్రస్తుతం తెలంగాణ మొత్తం నామినేషన్లు.. నేతల ప్రచారాలతో హోరెత్తుతోంది.

ఎన్నికల సమయం దగ్గరపడటంతో నేతలంతా ఎత్తులకు పై ఎత్తులతో ముందుకెళుతున్నారు. ఈ సమయంలో యంగ్ హీరో రామ్ రాజకీయ నాయకులనుద్దేశించి పెట్టిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.ఓటు హక్కు ఉన్నవారందరూ ఎన్నికలలో వారి హక్కును వినియోగించుకోవాలని అన్నాడు రామ్. అయితే నిజాయితీ పరుడైన నాయకుడిని ఎన్నుకోవాలని ఆయన అన్నాడు. రాజకీయాలకు వయసుతో సంబంధం లేదు. 20 ఏళ్లా.. 60 ఏళ్లా.. అన్నది కాకుండా ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉన్నవారు రాజకీయాల్లోకి రావాలి.

అనుభవం ఉన్నవారు నాయకులుగా నిలబడితే మరీ మంచిది. ఓటు వెయ్యడం అన్నది మన బాధ్యత. ఆ హక్కుతో నిజాయతీ గల నాయకుడిని ఎన్నుకోవాలి. దయచేసి ఓటు హక్కును దుర్వినియోగం చేయకండి’’ అని రామ్ పేర్కొన్నారు.  ఈవిధంగా రామ్ సామజిక మాధ్యమాలలో స్పందించడం ప్రస్తుతం వైరల్ అయ్యింది. ఇంతకీ ఈ మాటలు ఎందుకు అన్నట్టో.. భవిష్యత్ లో రామ్ కూడా రాజకీయాల్లోకి వస్తాడా అన్న డౌట్ అభిమానుల్లో మొదలైంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: