టాలీవుడ్ లో కి అసిస్టెంట్ డైరెక్టర్ గా తన ప్రస్థానం మొదలు పెట్టిన రవితేజ తర్వాత చిన్న చిన్న పాత్రల్లో కనిపించాడు.  పూరి జగన్నాధ్ డైరెక్టర్ గా వస్తున్న సమయంలో రవితేజతో ‘ఇడియట్’ సినిమా తీశారు.  ఈ సినిమాలో లోకల్ గా ఉండే ఓ యువకుడు ఉన్నత పోలీస్ అధికారి కూతురు ప్రేమలో పడటం..ఏ ప్రేమ ఎలా గెల్చుకున్నాడన్న కాన్సెప్ట్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది.  దాంతో అటు పూరి..ఇటు రవితేజకు ఒక్కసారే అదృష్టం కలిసి వచ్చింది.  ఈ సినిమా తర్వాత మాస్ మహరాజు గా పేరు తెచ్చుకున్న రవితేజ వరుసగా హట్ సినిమాల్లో నటిస్తూ వచ్చాడు.
Image result for raviteja amar akbar anthony stills
కాకపోతే ఆ మద్య కిక్ 2, బెంగాల్ టైగర్ లాంటి డిజాస్టర్ సినిమాల్లో నటించి కెరీర్ ఇబ్బందుల్లో పడేసుకున్నాడు.  దాంతో రెండు సంవత్సరాల గ్యాప్ ఇచ్చిన రవితేజ ‘రాజా ది గ్రేట్ ’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు.  వెంటనే టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు తో మళ్లీ డిజాస్టర్స్ పొందాడు.  దాంతో ఇప్పుడు వచ్చే సినిమా మంచి హిట్ కావలనే ఉద్దేశంతో తనకు గతంలో మంచి హిట్స్ అందించిన శ్రీను వైట్లనే నమ్ముకున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో  'అమర్ అక్బర్ ఆంటోని' ఈ నెల 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ఆయన ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా వున్నాడు.
Image result for raviteja amar akbar anthony stills
ఈ సినిమాను గురించి ఆయన మాట్లాడుతూ .."ఈ సినిమాలో నేను పోషించిన అమర్ అక్బర్ ఆంటోని పాత్రలు మూడు కూడా వేటికవే వైవిధ్యభరితమైనవి.  అయితే ఈ మూడు పాత్రల్లో అమర్ పాత్ర అందరికీ బాగా కనెక్ట్ అవుతుందని అన్నాడు. నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను చేయడానికి నాకు ఇంకా సమయం ఉందని అనుకుంటున్నాను. భవిష్యత్తులో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను తప్పకుండా చేస్తాను.  అందులో కూడా వైవిధ్యభరిత పాత్రలు అయితేనే చేస్తానని అన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: