కన్నడ ఇండస్ట్రీలో హీరో యష్ కి మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. కన్నడ హీరో యశ్ ప్రధానపాత్రలో ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సినిమా కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్).  శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమా, తెలుగు .. తమిళ .. మలయాళ .. హిందీ .. చైనీస్ .. జపనీస్ భాషల్లో డిసెంబర్ 21వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన  ట్రైలర్‌ అత్యధిక వ్యూవ్స్‌తో దూసుకుపోతోంది. మొత్తం ఐదు భాషల్లో కలిపి నాలుగు రోజుల్లో 3 కోట్ల వ్యూవ్స్ వచ్చాయి. 


ఒక్క తెలుగులోనే 6 మిలియన్ వ్యూవ్స్ సాధించింది. డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానున్న కేజీఎఫ్ సినిమా ట్రైలర్‌ మరెన్ని మిలియన్ల వ్యూవ్స్ సాధిస్తుందో చూడాలి. వారాహి చలన చిత్ర బ్యానర్ పై ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 9వ తేదీన ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. పిరియాడికల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా 1970 కాలం నాటి వాస్తవికత కళ్లకు కట్టినట్లు చూపించారు.  ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్ ట్రైలర్‌కు అస్సెట్‌గా నిలిచాయి.

Image result for కేజీఎఫ్(కోలార్ గోల్డ్ ఫీల్డ్స్)

ఈ సినిమాలో యష్  సరసన శ్రీనిధి శెట్టి నటించగా.. తమన్నా స్పెషల్ సాంగ్‌లో మెరవనుంది. లెజెండరీ నటులు కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిల్మ్స్ పతాకం పై రాకింగ్ స్టార్ యష్ హీరోగా రూపొందిన ఈ సినిమా ‘కేజీఎఫ్(కోలార్ గోల్డ్ ఫీల్డ్స్)’ పై భారీ అంచనాలే నెలకొన్నాయి.  విజయ్ కిరగందూర్ నిర్మాణంలో భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కించారు. డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల సిద్దం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: