బ్రహ్మానందం ఎమ్ ఎస్ నారాయణల రేంజ్ లో టాప్ కమెడియన్ స్టేటస్ అనుభవించిన సునీల్ హీరోగా ఎంట్రీ ఇచ్చి తన కెరియర్ కు కోలుకోలేని పొరపాటును తనంతట తానుగా చేసుకున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా గత కొన్ని సంవత్సరాలుగా విజయం అన్నది అతడికి అందని వస్తువుగా మారిపోవడంతో తిరిగి కమెడియన్ గా యూటర్న్ తీసుకుని ‘అరవింద సమేత’ ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. 
కమెడియన్ సునీల్ లేటెస్ట్ స్టిల్స్
అయితే త్రివిక్రమ్ సునీల్ కు క్రియేట్ చేసిన పాత్ర ఏమిటో ప్రేక్షకులకే కాదు సునీల్ కు కూడ అర్ధం కాని విషయంగా మారిపోవడంతో ‘అరవింద సమేత’ సునీల్ కు ఏమాత్రం కలిసి రాలేదు. దీనితో సునీల్ ఆశలన్నీ రేపు విడుదల కాబోతున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ పై ఉన్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీలో కూడ సునీల్ కు నిరాశ ఎదురవ్వడం ఖాయం అని అంటున్నారు. 
కమెడియన్ సునీల్ లేటెస్ట్ స్టిల్స్
ప్రస్తుతం హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఈమూవీలో సునీల్ కామెడీ కన్నా కమెడియన్ సత్య కామెడీ హైలెట్ గా ఉంటుందని అంటున్నారు. దర్శకుడు శ్రీను వైట్ల సత్య కోసం క్రియేట్ చేసిన కామెడీ ట్రాక్ ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తుందని వార్తలు వస్తున్నాయి. శ్రీనువైట్ల ‘ఢి’ సినిమాలో సునీల్ కోసం క్రియేట్ చేసిన కామెడీ రేంజ్ లో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ లో సత్య కామెడీ ట్రాక్ ఉంటుందని అని అంటున్నారు. 
Photo of Suneel
దీనితో సునీల్ కామెడీ ట్రాక్ ఊహించినంతగా అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు అనే వార్తలు ఇప్పటికే ఈసినిమాను విడుదలకు ముందు చూసిన ఇండస్ట్రీలోని కొందరు అంటున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా కొందరు దర్శకులు సునీల్ ను తమ చిన్న సినిమాలలో పెట్టుకుందామని ప్రయత్నాలు చేస్తుంటే సునీల్ ఏకంగా రోజుకు 4 లక్షలు డిమాండ్ చేస్తున్న నేపధ్యంలో అంత డబ్బుకు జబర్దస్త్ బ్యాచ్ లోని చాలామంది కమెడియన్స్ గుంపుగా వస్తారు కదా అన్న ఆలోచనలతో సునీల్ ను పక్కకు పెడుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా సునీల్ కు సెకండ్ ఇన్నింగ్స్ కూడ కలిసి వస్తున్నట్లు కనిపించడం లేదు..   


మరింత సమాచారం తెలుసుకోండి: