సెంటిమెంట్ లేని ప్రపంచం లేదు. సినిమా రంగంలో అయితే సెంటిమెంట్ కే అగ్ర తాంబూలం వేస్తారు. కాలు తీసి కాలు వేయాలన్నా ముహూర్తాలు చూసుకుంటారు. ఇక ఒకసారి హిట్ ఇచ్చిన హీరోయిన్ ని, డైరెక్టర్ ని అసలు విడిచిపెట్టరు. వాళ్ళతో కనీసం ఒక చిన్న సీన్ చేసినా సినిమా హిట్ అవుతుందని భావిస్తారు. తెలుగులో తీసుకుంటే అలాంటి సెంటిమెంట్ ఉన్న ఓ సీనియర్ అగ్ర నటుడు తన సినిమాలో ఆ హీరోయిన్ ని కోరి మరీ ఓ పాత్ర కోసం తీసుకున్నారట.


శ్రియ సోయగాల నయాగారం. అందాల బాండాగారం. గారలు పోయే సొగసుతో సెగ పుట్టించే ఈ హాట్ బ్యూటీ పెళ్ళి అయినా కూడా ఎక్కడా తగ్గకుండా తన అందాన్ని అలా పరచేసి కుర్ర కారుకు కిర్రాకు  తెస్తోంది. శ్రియ బాలయ్య జోడి ఓ  సూపర్ డూపర్ హిట్ పెయిర్. ఈ ఇద్దరు కలసి మూడు మూవీస్ చేస్తే అందులో రెండు మంచి హిట్లు. ఒకటి పర్వలేదనిపించింది. అందుకే ఈ అమ్మడు తో మరో మారు జోడీ కట్టాలని బాలయ్య ఫిక్స్ అయ్యాడట. 


బాలయ్య లేటెస్ట్ గా తన తండ్రి నందమూరి జీవిత చరిత్రను తీస్తున్నారు. ఈ సినిమాలో ధుర్యధనుని గెటప్ లో బాలయ్య ఉంటే ఆయన‌ సతీమణి భానుమతి గా శ్రియ నటించబోతోందట. ఈ ఇద్దరూ కలసి చిత్రం భళారే విచిత్రం అన్న పాటను పాడుతూ ఈనాటి జనరేషన్ని ఓ రోమాంటిక్ మూడ్ లోకి తీసుకెళ్తారట. ఈ పాత్ర పోషణ కోసం శ్రియను అడిగిన వెంటనే ఓకే అనేసిందని టాక్. త్వరలో శ్రియకు సంబంధించిన షాట్స్ షూట్ చేయనున్నారని ఫిల్మ్ మేకర్ల కధనం.


మరింత సమాచారం తెలుసుకోండి: