టాలెంట్ ఎవరి అబ్బ సొత్తు కాదు అని ఆ మద్య ఓ సినిమాలో హీరో డైలాగ్ కొడతారు. అవును టాలెంట్ ఉన్నవాడు ఎక్కడైనా నెగ్గుతాడు..కొకపోతే కాస్త టైమ్ పడుతుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఓ సాధారణ మహిళ గాత్రం అందరినీ ఆశ్చర్య పరుస్తుంది. ఆమె పాత పాటలు పాడుతుంటే..వర్జినల్ పాటలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటున్నాయి.  చాలామంది తమ ప్రతిభను తమలోనే దాచుకుని ఉండిపోతారు. అవకాశాలు వచ్చిన వాళ్లు తామేంటో రుజువు చేసుకుని ఫేమ్ సంపాదిస్తారు. అలాంటి ప్రతిభే ఉన్న ఒక సాధారణ మహిళ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. 

ఇంతకీ ఆమె ఎవరా ఆంధ్రా ప్రాంతంలోని ఒక పల్లెటూరికి చెందిన అనుకుంటున్నారా..బేబీ.  అప్పుడప్పుడు కూని రాగాలు తీస్తూ..కొన్ని మధురమైన పాటలు పాడుతున్న సమయంలో ఓ ఔత్సాహికురాలు బేబి పాడిన పాట రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతే అప్పటి నుంచి ఆమె గానం విన్న ప్రతివాళ్లూ షాక్ తిన్నారు..ఇంత మంచి గాయకురాలు మారుమూల గ్రామంలో ఉన్నారా అంటూ మీడియాలో వారు వెళ్లి ఆమెతో ప్రత్యేక ఇంటర్వ్యూలు తీసుకోవడం పాడించడం జరిగింది. 

ఆమె పాటలు విన్న సినీ సంగీత దర్శకులు సైతం మెచ్చుకున్నారు..ఆమెకు సినిమాల్లో పాడేందుకు ఛాన్స్ కూడా ఇస్తామన్నారు.  తాజాగా ఒక వ్యక్తి వీడియో రికార్డ్ చేస్తుంటే చాలా క్యాజువల్‌గా ‘ప్రేమికుడు’ సినిమాలోని ఓ చెలియా నా ప్రియ సఖియా అనే పాట పాడింది. అద్భుతమైన గాత్రంతో ఆమె కట్టి పడేసింది. ఎక్కడా శ్రుతి తప్పకుండా పదాలు పొల్లు పోకుండా అద్భుతంగా పాడిందీ పాటను బేబీ.
Related image
విశేషం ఏంటంటే బేబీ పాట ‘ప్రేమికుడు’ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ దగ్గరికి కూడా వెళ్లింది. ఆయన సైతం ఈ పాట విని ఫిదా అయిపోయాడు. ఎవరో తెలియదు కానీ.. అద్భుతంగా పాడిందంటూ తన ఫేస్ బుక్ పేజీలో ఆయన కామెంట్ పెట్టడం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: