ప్రపంచ వ్యాప్తంగా అమ్మాయిలపై లైంగిక వేదింపులు, అఘాయిత్యాలు అకృత్యాలు, అత్యాచారాలు, భౌతిక, మానసిక దాడులు నిత్య కృత్యాలయ్యాయి. వీటిని నిలువరించి అడ్డుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అవి సఫలం కావడం లేదు. మనదేశంలో రోజూ ఏదో ఒక మూలన ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. 
ఈ అఘాయిత్యాలకు ఎంతో కొంత అమ్మాయిల తప్పుకూడా ఉందనేది కొందరు నిపుణుల అభిప్రాయం. 
Image result for anupama parameswaran on sexual harassment
తాజాగా  టలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ కథానాయిక అనుపమ పరమేశ్వరన్  కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక కార్యక్రమంలో మాట్లాడిన అనుపమ పరమేశ్వరన్ అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి మాట్లాడటం జరిగింది. ఈ సందర్బంగా అనుపమ అమ్మాయిలకు కొన్ని సలహాలు ఇవ్వటమే కాదు తాను గతంలో ఎదుర్కొన్న వేదిపులను వివరించి తాను ఎలా ఆ యిబ్బంది నుండి బయటపడ్డారో సోదాహరణంగా చెప్పారు. 
Image result for anupama parameswaran on sexual harassment
ఆ సలహా పాటించటం అమ్మాయిలకు కాస్త ఇబ్బందే అయినా కూడా వాటిని పాటించడం వల్ల ఖచ్చితంగా అమ్మాయిలు అబ్బాయిల దాడి నుండి కాస్తైనా ఉపశమనం పొందే అవకాశంతో పాటు ఇతరులు కూడా అభినందించే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఒక అమ్మాయితో అబ్బాయి చెడుగా ప్రవర్తించినప్పుడు వెంటనే ఆ అమ్మాయి స్పందించవద్దు. ఆ సమయంలో “సీరియస్ రియాక్షన్” అవతలి వ్యక్తిని మరింత వయోలెంట్ అయ్యేలా చేస్తుంది. అంటే రెచ్చగొట్టినట్లో? లేక ఆహం మీద దెబ్బగొట్టినట్లో ఉండే అవకాశం ఉంది అంటూ: 
Related image
“నేను కాలేజ్ వెళ్లే సమయంలో ఒక వ్యక్తి బస్ లో నన్ను టచ్ చేసేందుకు ప్రయత్నించాడు. అప్పుడావ్యక్తిని సున్నితంగా “పక్కకు జరగండి”  అన్నాను. అలా కాకుండా సీరియసై చెంప పగల కొడితే పరిస్థితి మరింత సీరియసయ్యే అవకాశం ఉందని, ఆ తర్వాత ఎప్పుడైనా ఆ వ్యక్తి  నాపై కోపంతో దాడికి ప్రయత్నించే అవకాశం ఉంది కనుక,  ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినప్పుడు వెంటనే “సీరియస్ రియాక్ట్” కావద్దని అనుపమ చక్కని సలహా ఇచ్చింది. నిజంగానే అమ్మాయిలు ఆ సమయంలో కాస్త శాంతంగా ఉండి - తర్వాత పరిణామాలను ఆలోచిస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుందని మానసిక శాస్త్ర నిపుణులు కూడా అంటున్నారు.

Image result for anupama parameswaran erotic images

మరింత సమాచారం తెలుసుకోండి: