‘జనసేన’ అధినేత పవన్ నిన్న రాత్రి ఒక పెను ప్రమాదం నుండి తృటిలో తప్పించు కున్నట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ కు తృటిలో ప్రమాదం తప్పింది. తూర్పు గోదావరి జిల్లాలో ప్రస్తుతం పవన్ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. 

ఈపరిస్తుతులలో ఒక బహిరంగ సభ కోసం ఆయన కాకినాడ నుంచి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రాజానగరం వెళ్తుండగా ప్రమాదం జరిగింది అని వార్తలు వస్తున్నాయి. జనసేనాని కాన్వాయ్‌ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో పవన్ కళ్యాణ్ ప్రయివేటు సిబ్బందికి గాయాలు అయ్యాయి. 

వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారు ప్రయివేటు బౌన్సర్లు. ఎనిమిది మంది గాయపడ్డారు. రాజానగరంలోని రంగంపేట వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అందరికి చిన్న గాయాలు కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈపరమాడంలో గాయపడ్డ వారందరిని చికిత్స నిమిత్తం రాజానగరం సమీపంలోని జీఎస్‌ఎల్‌ ఆసుపత్రికి తరలించారు. 

పవన్‌ ప్రయాణిస్తున్న వాహనం ముందే సభా వేదిక వద్దకు వెళ్తుండగా ఈప్రమాదం వేగంగా వెళుతున్న లారీ అదుపుతప్పడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాధమీక వార్తలు వస్తున్నాయి. ఈమధ్య కాలంలో పవన్ కూడ తన ప్రాణానికి హాని ఉంది అంటూ వ్యాఖ్యలు చేస్తున్న నేపధ్యంలో ఈ ప్రమాదం ఎలా జరిగింది అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదంలో పవన్ ఎటువంటి గాయాలు లేకుండా క్షేమంగా బయటపడటంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు..   



మరింత సమాచారం తెలుసుకోండి: