వరుస పరాజయాల తరువాత శ్రీనువైట్ల , రవితేజ ఇద్దరు జతకట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అయితే ఈ సినిమా ట్రైలర్ సరికొత్తగా ఉండటం తో ప్రేక్షకులు ఆసక్తి ని కనబర్చారు. అయితే  వరస పరాజయాలతో వెనకబడిపోయిన దర్శకుడు శ్రీను వైట్లకు ఇది రీఎంట్రీ లాంటి సినిమా. అందుకే ఈసారి ఎలాగైనా హిట్టుకొట్టి పూర్వ వైభవం సంపాదించాలని శ్రీనువైట్ల కసితో ఈ సినిమాను తెరకెక్కించారు. టీజర్, ట్రైలర్, పాటల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు. మొత్తానికి భారీ అంచనాల నడుమ నేడు(నవంబర్ 16న) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 

ఇలియానా గ్లామర్

ఇదిలా ఉంటే, యూఎస్‌లో ఇప్పటికే ప్రీమియర్ షోలు ప్రదర్శితమయ్యాయి. అక్కడ సినిమా చూసినవాళ్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. సినిమా చాలా బాగుందని, ఇది శ్రీనువైట్ల పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ అని కొనియాడుతున్నారు. శ్రీనువైట్ల ఈజ్ బ్యాక్ అంటున్నారు. ఫస్టాఫ్‌లో శ్రీనువైట్ల తన మార్క్ కామెడీతో కడుపుబ్బా నవ్వించారట. ఇక రవితేజ కామెడీ టైమింగ్, ఎంటర్‌టైన్మెంట్ గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీలేదు. ఇలియానా అందం, థమన్ మ్యూజిక్ సినిమాకు మరో ప్లస్ అంటున్నారు. పాటల చిత్రీకరణ అద్భుతంగా ఉందట. 
రూటు మార్చిన శ్రీనువైట్ల
అయితే, మరికొంత మంది మాత్రం ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉందని అంటున్నారు. సెకండాఫ్‌లో కామెడీ బాగుందని చెబుతున్నారు. రొటీన్ స్క్రీన్‌ప్లేతో శ్రీనువైట్ల ఆకట్టుకోలేకపోయారనే టాక్ కూడా వస్తోంది. కానీ కచ్చితంగా చూడాల్సిన సినిమా అట. రవితేజ ఇరగదీశారని, థియేటర్‌లో సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారని అంటున్నారు. మొత్తంగా చూసుకుంటే సినిమా హిట్ అనే టాక్ వినిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: