‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేయాలి అన్న ఉద్దేశ్యంతో చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ అవుట్  పుట్ విషయంలో చిరంజీవి అసంతృప్తిగా ఉన్నాడు అంటూ కొందరు ఇండస్ట్రీలో గాసిప్పులు సృష్టిస్తూ హడావిడి చేస్తున్నారు. దీనికి కారణం ఈమధ్య ‘సైరా’ షూటింగ్ సమయంలో చిరంజీవి తరుచూ ప్రదర్శిస్తున్న అసహనం అని టాక్.
megastar chiranjeevi starrer sye raa narasimha reddy teaser released
వాస్తవానికి ‘సైరా’ నిర్మాణ వ్యవహారాలు అన్నీ రామ్ చరణ్ ఇప్పటి వరకు దగ్గర ఉండి చూసుకున్నాడు. అయితే చరణ్ ఈమధ్య తన దృష్టి అంతా తన లేటెస్ట్ మూవీ ‘వినయ విధేయ రామ’ పూర్తిచేసే విషయంలో దృష్టి పెట్టడంతో చిరంజీవి స్వయంగా ‘సైరా’ నిర్మాణ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దీనితో షూటింగ్ సమయంలో చిరంజీవి ఈమూవీ నిర్మాణ విషయంలో జరుగుతున్న పొరపాట్లు గురించి తీవ్ర అసహనంగా ఉండటమే కాకుండా ఈమధ్య కొన్ని సందర్భాలలో దర్శకుడు సురేంద్ర రెడ్డి పట్ల కూడ చిరంజీవి కోపం తెచ్చుకున్నట్లు టాక్. ఈ అనుకోని పరిణామానికి షాక్ అయిన సురేంద్ర రెడ్డి కూడ చిరంజీవి తన పై కోపగించిన విషయాన్ని చరణ్ దృష్టికి తీసుకు వచ్చినట్లు సమాచారం. 

దీనితో చిరంజీవి ఒకవైపు నటిస్తూ మరొకవైపు నిర్మాణ బాధ్యతలు చూస్తూ ఉండటం వల్ల తన పెరిగిన వయస్సు వల్ల ఇలా అలసటకు లోనై అసహనానికి గురి అవుతున్నాడా ? లేదంటే ‘సైరా’ షూటింగ్ నడుస్తున్న తీరు చిరంజీవికి నచ్చడం లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మెగా కాంపౌండ్ సన్నిహితులు మాత్రం ఇదంతా ‘సైరా’ పై నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడానికి కొందరు మెగా ఫ్యామిలీ వ్యతిరేకులు వ్యూహాత్మకంగా వదులుతున్న ఫీలర్స్ అంటూ సద్ది చెపుతున్నట్లు తెలుస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: