తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఆ మద్య రజినీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ చిత్రంలో ఎంతో సాంప్రదాయంగా నత్తిగా మాట్లాడుతూ..అందరి మనసు దోచింది నయనతార.  ఆ తర్వాత సూర్య నటించిన గజిని చిత్రంలో హాట్ హాట్ గా కనిపిస్తూ కుర్రాళ్లను పిచ్చివాళ్లను చేసింది.  మంచి ఫిజిక్, అందం..నటన అన్ని కలగలసిన నయనతార అతి తక్కువ కాలంలోనే తెలుగు, తమిళ, మళియాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది.  తమిళనాటు ఈ అమ్మడిని లేడీ సూపర్ స్టార్ అంటారు. 
Image result for saira narasimha reddy
తమిళంలో వరుస సినిమాలు.. వరుస విజయాలు ఆమె స్థాయిని అంతకంతకూ పెంచేస్తున్నాయి. నయన్ లైఫ్ లో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా..తన కెరీర్ మాత్రం ఎక్కడా డ్యామేజ్ కాకుండా ఇప్పటికీ కుర్ర హీరోయిన్లకు పోటీగా నటిస్తుంది.  దక్షిణాదిన ఎక్కుడ దాదాపు మూడు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఏకైక నటీగా గుర్తింపు తెచ్చుకుంది. నయన్ చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి స్టార్ హీరోల సినిమాల స్థాయిలో కాసుల వర్షం కురుస్తుండటం విశేషం. అంత బిజీగా ఉండటం వల్లనే ఆమె తెలుగు సినిమాలు తగ్గించేసింది. 
Image result for saira narasimha reddy
వెంకటేశ్, బాలకృష్ణ, చిరంజీవి స్థాయి సినిమాలకే ఆమె ఓకే చెబుతోంది. ప్రస్తుతం నయనతార మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.   ఈ చిత్రం కోసం ఆమె కేవలం మూడు రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చిందట. ఈ మూడు రోజుల్లోనే ఆమె కాంబినేషన్ సీన్స్ కానిచ్చేయాలి. లేదంటే మళ్లీ ఆమె డేట్స్ ఎప్పటికో గాని లేవట. అందువలన సురేందర్ రెడ్డి ఆమె కాంబినేషన్ సీన్స్ విషయంలో పక్కా ప్లానింగ్ తో వున్నాడని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: