మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాన్.  తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎంత గొప్ప ఫాలోయింగ్ ఉందో..పవన్ కళ్యాన్ కూడా ఆ రేంజ్ ఫాలోఅప్ సంపాదించాడు.   గతంలో మెగాస్టార్ రాజకీయాల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే..ప్రస్తుతం పవన్ కూడా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.  ఆయన స్థాపించిన జనసేన పార్టీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీకూడా చేయబోతున్నారు. ఇక తెలుగు ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్-పవన్ కాంబినేషన్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘జల్సా’,‘అత్తారింటికి దారేది’ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.  ఇదే కాంబినేషన్ లో ‘అజ్ఞాతవాసి’వచ్చింది..కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఈ చిత్రం భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. 
Image result for agnathavasi movie
అంతేకాదు ఈ మూవీని కొన్న బయ్యర్స్‌కు భారీ నష్టాలను మిగిల్చింది. అంతేకాదు దేశవ్యాప్తంగా బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌లో మూడో ప్లేస్‌లో నిలిచింది. భారీ డిజాసర్ట్ కోవలో ‘బాంబే వెల్వెట్’ మొదటి స్థానంలో ఉండగా...మహేశ్...‘స్పైడర్’ ఆల్ టైమ్ ఇండియన్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌లో రెండో ప్లేస్‌లో నిలిచింది.  ఇదిలా ఉంటే త్రివిక్రమ్ చిత్రాలు వెండితెరపై సక్సెస్ కాకపోయినా..బుల్లితెరపై మంచి క్రేజ్ ఉంటుందన్న విషయం తెలిసిందే.  . గతంలో త్రివిక్రమ్ డైరెక్షన్‌లో మహేశ్ హీరోగా వచ్చిన ‘ఖలేజా’ థియేటర్‌లో ఆడకపోయినా..టీవీ తెరపై ఇరగదీసింది.
Image result for agnathavasi movie
తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘అజ్ఞాతవాసి’ సినిమాను జెమినీ టీవీ దాదాపు 19.5 కోట్లకు కొనుగోలు చేసింది.  ఇక దీపావళి కానుకగా బుల్లితెరపై ‘అజ్ఞాతవాసి’మూవీని ప్రసారం చేసారు. దీపావళి కానుకగా జెమినీ టీవీలో ప్రసారమైన ‘అజ్ఞాతవాసి’ మూవీకి కేవలం 5.3 టీఆర్పీస్ వచ్చాయి.
Image result for agnathavasi movie
మహేశ్ బాబు హీరోగా వచ్చిన ‘స్పైడర్’ మూవీ కంటే ఈ టీఆర్పీ చాలా తక్కువ. దాంతో పవన్ నటించిన ‘అజ్ఞాతవాసి’ బుల్లితెరపై కూడా ఫ్లాప్ అయినట్లే. మొత్తానికి థియేటర్స్‌లో ఆల్ టైమ్ డిజాస్టర్‌గా నిలిచిన ‘అజ్ఞాతవాసి’ ...టీవీల్లో కూడా ఆల్ టైమ్ డిజాస్టర్‌గా నిలిచింది.  కాకపోతే  ‘అజ్ఞాతవాసి’ మూవీ ఆన్ లైన్‌లో హిందీ డబ్బింగ్ వెర్షన్ మాత్రం రికార్డుల మోత మోగించడం కొసమెరుపు.



మరింత సమాచారం తెలుసుకోండి: