ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల అయిన ‘అజ్ఞాతవాసి’ ఫెయిల్యూర్ గురించి పవన్ మరిచిపోదాము అనుకున్నా మరవనివ్వకుండా జరుతున్న పరిణామాలు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటున్నాయి. ఈ మూవీ ఫెయిల్యూర్ దెబ్బకు ఏకంగా సినిమాలు వదిలి పవన్ రాజకీయాల బాట పట్టినా ఆ సినిమా పరాభవం ఇంకా పవన్ ను వెంటాడుతూనే ఉంది. 

ఈసినిమా తరువాత త్రివిక్రమ్ పై తీవ్రంగా విమర్శలు వస్తే ఈసినిమాను అత్యంత భారీ రేట్లకు కొనుక్కున్న బయ్యర్ల నష్టాలు ఈమూవీ నిర్మాతలు కొంతవరకు సహాయం చేసినా ఆ బయ్యర్లు ఇప్పటికీ కోలుకోలేదు. ఇలాంటి పరిస్థితులలో ‘అజ్ఞాతవాసి’ మరోసారి వార్తలలోకి వచ్చింది. వెండితెరపై డిజాస్టర్ గా నిలిచిన ‘అజ్ఞాతవాసి’ సినిమా బుల్లితెరపై కూడా మరోసారి అట్టర్ ఫ్లాప్ మారింది. 

సాధారణంగా టాప్ హీరోల సినిమాలను 2-3 నెలల గ్యాప్ లో టీవీల్లో ప్రసారం చేస్తుంటారు. అయితే ఆమూవీలు ఫ్లాప్ అయినా బుల్లితెర ప్రేక్షకులు ఆమూవీలను బాగా చూడటం ఎప్పటి నుంచో కొనసాగుతున్న బుల్లితెర సెంటిమెంట్. ఈమూవీని 19.50 కోట్లకు కొనుక్కున్న జెమినీ టీవి ఈమూవీని దీపావళి రోజున ప్రసారం చేసింది. టాప్ హీరోల సినిమాలు టిక్కెట్ లేకుండా ఊరికినే వచ్చాయి అంటే టీవిలలో చూడటానికి జనం ఎగబడతారు. 

అయితే ఆరోజు దీపావళి పండుగ అయినా జనం అంతా ఇళ్ళల్లో ఉండి  ఎంజాయ్ చేస్తున్నా ఎవరు ‘అజ్ఞాతవాసి’ ని పట్టించుకోక పోవడంతో ఈమూవీకి తెలుస్తున్న సమాచారం మేరకు కేవలం 5.3 టీఆర్పీ రేటింగ్ వచ్చిందని తెలుస్తోంది. ఒక స్టార్ హీరో సినిమాకు ఇంత తక్కువ రేటింగ్ బుల్లితెర రికార్డు అంటున్నారు. గతంలో బుల్లి తెరపై ప్రసారం అయిన  డిజాస్టర్ మూవీ ‘స్పైడర్’ కు కూడా టీవీల్లో ఇంత తక్కువ టీఆర్పీ రాలేదు. దీనితో పవన్ కు మాత్రమే కాదు జెమినీ టీవీకి కూడా మరిచిపోలేని పీడకల లా ‘అజ్ఞాతవాసి’ నీడలా వెంటాడుతూనే ఉంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: